టాక్సీవాలా ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

నోటా తో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ..టాక్సీవాలా తో సూపర్ హిట్ అందించి అభిమానులను అలరించాడు. నూతన డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , ప్రియాంక , మాళవిక జంటగా నటించిన ఈ మూవీ నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే సినిమా లీక్ కావడం తో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో అని నిర్మాతలు భయపడ్డారు. కానీ సినిమా విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.

రూ. 5 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ లాంగ్ రన్ లో రూ.50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ. 22 కోట్ల రూపాయలు షేర్ రావడం విశేషం. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా టాక్సీ మంచి లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్ గా విజయ్ ఖాతాలో టాక్సీవాలా సూపర్ హిట్ గా నిలిచిపోయింది.