పబ్లిక్ టాక్ : తేజ్ ఐ లవ్యూ – మెగా ఫ్యాన్స్ ఏం మాట్లాడలేకపోతున్నారు..

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక.

గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న తేజు ఈ సినిమా ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్, పాటలు చాల కూల్ గా ఉండడం తో ఈ రొమాంటిక్ లవ్ స్టోరీపై అంచనాలు పెంచేశాయి. మరి తేజు ‘తేజ్’ తో హిట్ అందుకున్నాడా..? లేదా అనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం.

ఇప్పటికే తేజ్ ఐ లవ్యూ ప్రీమియర్ షోలను అమెరికాలో ప్రదర్శించడం జరిగింది. ఇక సినిమా చూసిన చాలామంది ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్‌ను వినిపిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు మార్నింగ్ షో లు పడిపోయాయి. కొంతమంది మూవీ బావుందంటే.. కొందరు మాత్రం తేజ్ కాస్త నిరాశ పరిచారని , సినిమా బీలో యావరేజ్ అంటున్నారు. ఇక మెగా అభిమానులు సైతం సినిమా గురించి ఏం మాట్లాడలేకపోతున్నారు. దీంతో మరోసారి తేజు నిరాశపరిచాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా పరిస్థితి ఏంటి అని చెప్పలేం.