బిగ్ బాస్ 2 : తేజస్వి షాక్..సామ్రాట్ కు ముద్దు పెట్టిన దీప్తి సున‌య‌న‌..

బిగ్ బాస్ 2 తెలుగు ఈ వారం గత వారాల కంటే అదరగొడుతుంది..బిగ్ బాస్ హౌస్ సభ్యులంతా సినిమా ఆర్టిస్ట్ లు అయిపోయారు. వీరిలో కొంతమంది నిజమైన ఆర్టిస్ట్ లు కాగా , హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సామాన్య ప్రజలు అయిపోయారు. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ద్వారా మళ్లీ నటనలో బిజీ అయ్యారు.

బిగ్ బాస్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా మంగ‌ళ‌వారం కూడా ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ షూటింగ్ ఆట పాటలతో చాల హుషారుగా సాగింది. డైరెక్ట‌ర్ అమిత్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ దీప్తి, కెమెరా మెన్ రోల్ రైడాలు ఆర్టిస్టుల‌తో న‌వ‌ర‌సాలు పండిస్తూ షూటింగ్ రంజిపచేసారు. మ‌ధ్య మధ్య‌లో ప్రొడ‌క్ష‌న్ చీఫ్‌గా ఉన్న బాబు గోగోనేని నన్ను హీరోగా పెట్టుకోండని డైరెక్ట‌ర్‌కి టీం చెప్ప‌డం, హీరోల‌పై స‌ర‌దా కామెంట్స్ చేయడం వంటి సంఘ‌ట‌న‌లు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించాయి.

ముఖ్యంగా దీప్తి సున‌య‌న‌ ఈ ఎపిసోడ్ లో ఐటెం సాంగ్ తో అదరగొట్టింది. ఈమెను చూసిన వారంత హీరోయిన్ లక్షణాలు చాల ఉన్నాయని , ఈ షో పూర్తయిన తర్వాత దీప్తి కి హీరోయిన్ ఛాన్సులు వచ్చిన ఆశ్చర్యాపోనవసరం లేదని మాట్లాడుకుంటున్నారు. తేజస్వి కొరియోగ్రఫీ లో సామ్రాట్ , దీప్తి సున‌య‌న‌ లు ఆర్య 2 సినిమాలోని రింగ రింగ ఐటెం సాంగ్ కు రెచ్చిపోయారు. దీప్తి , సామ్రాట్‌ కాస్టూమ్స్ అదిరిపోగా, వారు చేసిన స్టెప్పుల‌కి బిగ్ బాస్ హౌజ్ మాత్రమే కాదు ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకుల హౌస్ లు కూడా షేక్ అయ్యాయి. ఇక సాంగ్ చివ‌ర‌లో దీప్తి సున‌య‌న‌.. సామ్రాట్‌కి ఓ ముద్దు ఇవ్వ‌డం హైలైట్‌గా నిలిచింది. మొత్తం మీద ఈ టాస్క్ మాత్రం అందర్నీ బాగా ఆనందపరిచింది.