త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమా ఉన్నట్టేనా ?

విభిన్న మైన పాత్రలు పోషించి తనకంటూ టాలీ వుడ్ లో ఒక ప్రత్యేక మైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ . ఈ మధ్య ఎఫ్ 2 ,వెంకీ మామ చిత్రాలతో మంచి ఫామ్ లోకి వచ్చిన వెంకటేష్ వరుసగా ఒక్కో ప్రాజెక్ట్ నీ పట్టాలెక్కిస్తున్నట్టు తెలుస్తుంది . అలాంటి ఆసక్తిని కలిగించే క్రేజీ కాంబినేషన్ ఒకటి సెట్ కాబోతుంది . గతంలో వెంకటేశ్ సినిమాలకి రచయితగా త్రివిక్రమ్ పనిచేసిన సంగతి తెలిసిందే. మల్లేశ్వరి ,నువ్వు నాకునచ్చావ్ లాంటి సినిమాలు ఎంత సంచలన విజయాలు నమోదు చేశాయో అందరికీ తెలిసిన విషయమే . వెంకటేశ్ తో ఒక సినిమా చేయనున్నట్టు త్రివిక్రమ్ ప్రకటించి చాలా కాలమే అయింది.

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు . ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వెంకటేశ్ తో ఒక సినిమా చేయడానికి త్రివిక్రమ్ రంగాన్ని సిద్ధం చేసే పనిలో వున్నాడట. ‘అసురన్’ రీమేక్ తరువాత వెంకటేశ్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.