వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తి కాగా..ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం తో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. నవంబర్ 01 నుండి చిత్ర షూటింగ్ లో పవన్ జాయిన్ కాబోతున్నారు.

ఇదిలా ఉంటె ఈ మూవీ శాటిలైట్ హక్కులను తెలుగు టెలివిజన్ టాప్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ వారు భారీ ధరకే కొనుగోలు చేసినట్టుగా సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్ చేస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.