వంశీ తప్పుకోవడానికి కారణం అదేనట..

నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నట్లు నిన్నటి వరకు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి నాగ వంశీ తప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఈయన ప్లేస్ లో వెంకట్ బోయనపల్లి నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ సినిమా నుండి వంశీ తప్పుకోవడానికి కారణం బడ్జెట్ విషయంలో చిన్న అవకతవకలు వచ్చి నాగవంశీ తప్పుకున్నారట. నాని ఈ చిత్రాన్ని మంచి డీసెంట్ బడ్జెట్ తో నిర్మాంచాలని సూచించారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అయ్యే పని కాదని ఆ నిర్మాణ సంస్థ వారు తప్పుకున్నారట. కానీ నాని ఈ సినిమాకు ఖచ్చితంగా లాభాలు తెచ్చి పెడుతుందనే నమ్మకంతోనే బడ్జెట్ విషయంలో రాజీ పడకూడదు అనుకున్నారట