వరుణ్ తేజ్ ‘గని’

గద్దల కొండ గణేష్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ తేజ్..ప్రస్తుతం బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి-వరుణ్‌తేజ్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి గని అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈరోజు వరుణ్ పుట్టిన రోజు సందర్భాంగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

వరుణ్ కెరీర్‌లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌, బ్లూ వాటర్‌ క్రియేటివ్‌ బ్యానర్స్‌పై అల్లు వెంకటేవ్‌, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.ఈ చిత్రం లో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నారు.