లైగర్ కు బీరుభిషేకం

పూరి – విజయ్ దేవరకొండ కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ కి తెలుగు తో పాటు హిందీ లోను మంచి పాపులార్టీ ఉండడం తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కామ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీ లో ఫైటర్ ను రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. కాగా ఈ చిత్రానికి మొన్నటి వారికి ఫైటర్ అనే టైటిల్ ప్రచారం కాగా..ఇప్పుడు మాత్రం ఈ చిత్రానికి లైగర్ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటనే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే అభిమానులు వారి అభిమానాన్ని చాటుకున్నారు.

సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే అభిమానులు పెద్ద కటౌట్స్‌ పెడతారు. అలాగే పాలాభిషేకం చేస్తారు. అయితే విజయ్‌ దేవరకొండ అభిమానులు విజయ్‌ దేవరకొండ ఫస్ట్‌లుక్‌కు బీరుతో అభిషేకం చేశారు. ఆ వీడియోను ఛార్మి తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది. ‘రచ్చ మొదలైంది’ అంటూ మెసేజ్‌ కూడా పోస్ట్‌ చేసింది ఛార్మి.