విజయ్ సేతుపతి సరసన రాశి..

వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న రాశి ఖన్నా..తాజాగా విజయ్ సేతుపతి సరసన జోడి కట్టబోతుంది. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘తుగ్లక్‌ స్టార్‌’. ఢిల్లీ ప్రసాద్‌ దీనాదయలన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితి రావ్‌ హైదరిని హీరోయిన్‌గా తీసుకున్నారు. తొలి షూటింగ్‌ అయ్యాక కరోనా లాక్‌డౌన్‌ రావడంతో సినిమాకు బ్రేక్‌ పడింది. దాంతో ఆమెకు డేట్స్‌ కుదరకపోవడంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె ప్లేస్ లో రాశీ ఖన్నా ను తీసుకున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు.

ఈ మేరకు ట్విటర్‌లో చిత్ర యూనిట్‌ ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ 7 స్రీన్‌ స్టూడియో. తుగక్లక్‌ సర్కార్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది.’ అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో రాశీ మార్వారీ అమ్మాయిగా నటించనున్నారు. ఇటీవల రాశీఖన్నాతో తొలి షూట్‌ చేయించారు. రాజకీయ నేపథ్యంలో సాగనుంది. డిసెంబర్‌ నాటికి పూర్తి చిత్రీకరణ జరిపేందుకు ఆలోచిస్తున్నారు.