వృద్ధురాలిగా కాజల్

శంకర్ కమల్ హాసన్ ల కాంబినేషన్లో భారతీయుడు 2 తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే . భారతీయుడు అనగానే అందరికీ మనసులో మెదిలే పాత్ర కమలహాసన్ వృద్ధుడిగా నటించిన సేనాపతి పాత్ర ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో ఆపాత్రను రివీల్ చేసాడు శంకర్ . మరి అదే చిత్రంలో కమల్ కి జోడీగా నటించిన సుకన్య మేకప్ కూడా ఆరోజుల్లో సంచలనమే ఆపాత్ర 2 వ పార్ట్ లో ఉందా లేదా అనే సందేహం అందరికీ ఉంది వాటన్నిటికీ చెక్ పెట్టేసింది కాజల్ అగర్వాల్ .

తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా కాజల్ కి మంచి క్రేజ్ వుంది. సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశాలతో ఆమె దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె కమల్ కథానాయకుడిగా చేస్తున్న ‘భారతీయుడు 2’లో నటిస్తోంది. ‘భారతీయుడు’లో సుకన్య చేసిన పాత్ర తరహాలో ఈ సీక్వెల్లో కాజల్ వృద్ధురాలి పాత్రలో కనిపించనుందనే టాక్ వచ్చింది. అయితే అలాంటి పాత్రను కాజల్ అంగీకరించకపోవచ్చని అంతా అనుకున్నారు.

కానీ తాజా ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను వృద్ధురాలి పాత్రలో కనిపించనుండటం నిజమేనని చెప్పింది. “ఈ పాత్రను నేను చేయగలనా .. లేదా అనే సంశయంతో చాలా భయపడ్డాను. కానీ నా మేకప్ చూసి నాకే ఆశ్చర్యం కలిగింది .. నాపై నాకు నమ్మకం పెరిగింది. ఈ పాత్ర నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చింది.