ప్రేక్షకులకు పట్టని ఎన్టీఆర్.. వైఎస్

టాలీవుడ్ లో బయోపిక్ ల హడావిడి మొదలైయింది. ”మహానటి” విజయం బయోపిక్స్ కు కొత్త జోష్ తీసుకొచ్చింది. ఆ జోరులోనే బయోపిక్స్ కొన్ని సెట్స్ పైకి వెళ్ళాయి. అయితే మహానటి తర్వాత వచ్చిన బయోపిక్స్ మాత్రం రాణించలేకపోయాయి. పది రోజుల గ్యాప్ తీసుకోని రెండు బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘యాత్ర’. ఈ రెండు కూడా పొలిటికల్ ఎజెండా వున్న సినిమాలు. ఎన్నికలని ద్రుష్టిలో పెట్టుకొని తీసిన సినిమాలు. ఐతే ప్రేక్షకులు మాత్రం వాటిని చాలా లైట్ తీసుకున్నారు. ఒక పక్క ఎన్టీఆర్ జీవితం చరిత్ర.. మరో పక్క వైఎస్ లాంటి నాయకుడి జీవితం. అయితే ఈ రెండు కూడా ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి.

బేసిగ్గా బయోపిక్ అంటే జీవితంలోని నిజాలని చూపించాలి. వాస్తవాలని ప్రజలకు తెలియాలి. మహానటి జీవితంలో కూడా ఇదే జరిగింది. సావిత్రి విలాసపరురాలు, మద్యంకు బానిస, ఆమెకు షుగర్ వచ్చింది, బెంగళూర్ హాస్పిటల్ లో దిక్కులేక వంటరిగా చేరింది.. ఇవన్నీ నిజాలు. దర్శకుడు వాటిని చాలా హుందాగా చూపించాడు. అక్కడే ఆ సినిమా విజయం అయ్యింది. కానీ ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘యాత్రలో మాత్రం ఆ జెన్యునిటీ లోపించింది. కేవలం ఏక పక్షంగా సాగాయి. ఒక వ్యక్తి జీవితంలో అసలు నెగిటివ్ సైడ్ లేదన్నట్టుగా చూపించారు. దీంతో ప్రేక్షకులు కూడా వీటిని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎంత హడావిడి చేసినా లాభం లేకపోయింది. టోటల్ గా ఈ సినిమాలు జనాలకు అస్సల్ పట్టలేదు.