జగన్ దూకుడు.. కోర్టు చెక్

గత ప్రభుత్వ నిర్ణయాల్ని పునస్సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, సిట్ చర్యలను నిలువరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఉపసంఘం, సిట్ ఏర్పాటుకు సంబంధించిన జీవోల ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ పిటిషన్లలో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ప్రతివాదులుగా చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌నూ కొట్టేసింది.

ఈ వ్యాజ్యాల్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు  ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.