ఈబీసీ కోటాపై కీలక ప్రకటన


అగ్ర‌కులాల పేద‌ల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ కేంద్రం బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకి సంబంధించి ఇటీవలే రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదలైంది. ఈ కోటాను ఈ ఏడాది విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు.

ఈడ‌బ్ల్యూఎస్‌ రిజ‌ర్వేష‌న్‌ను 2019-20 సంవ‌త్స‌రం నుంచి విద్యాల‌యాల్లో అమ‌లు చేయ‌నున్న‌ట్లు జ‌వ‌దేక‌ర్ తెలిపారు. దేశ‌వ్యాప్తంగా మొత్తం 40 వేల కాలేజీలు, 900 వ‌ర్సిటీల్లో ఈబీసీ కోటా అమ‌లు చేస్తాం. ఈబీసీ కోటా అమ‌లు కోసం ప్ర‌త్యేకంగా విద్యా సంస్థ‌ల్లో 25 శాతం సీట్ల‌ను కూడా పెంచ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈబీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను కూడా అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప‌పారు.