15 యేళ్ల తర్వాత మళ్లీ అవిశ్వాసం

ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తెదేపా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తెదేపా ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరుగుతుందని స్పీకర్‌ చెప్పడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2003లో చివరిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అప్పటి వాజ్‌పేయీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. ఇది 314-189 ఓట్ల తేడాతో వీగిపోయింది.

దాదాపు 15 తర్వాత లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు తేదాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ తో పాటుగా దేశంలోని పలు పార్టీలు మద్దతు ఇవ్వడం విశేషం.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. దీన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్డీయే ప్రభుత్వం వెల్లడించింది.