ఇండియాటుడే సర్వే నిజమవుతుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు తమ విజయం ఫై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రజల తీరు ఎలా ఉందొ తెలుసుకోవాలని అన్ని మీడియా ఛానల్స్ సర్వే చేస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే లు బయటకు రాగా , తాజాగా ఇంగ్లిష్ ఛానల్ ఇండియాటుడే చేసిన సర్వే ను బయటపెట్టింది. ఈ సర్వే తెలుగుదేశం నేతల్లో కంగారు పెట్టిస్తే, వైస్సార్సీపీ నేతల్లో మాత్రం ఉత్సహం నింపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గ్రాఫ్ మునపటి కంటే బాగా పెరిగిందని , ఆరునెలల కిందట జగన్ కు 43శాతం మంది మద్దతు కనిపించిందని, ప్రస్తుత నెల ఫిబ్రవరిలో జగన్ కు 45 కి పెరిగిందని ఇండియాటుడే పేర్కొంది. ఇక ముఖ్యమంత్రి , తెలుగుదేశం అధినేత చంద్రబాబు గ్రాఫ్ మాత్రం మునపటి తో పోలిస్తే రెండు శాతం తగ్గిందని తెలిపింది. ప్రస్తుతం జనం తీరు చూస్తే జగన్ కు 45 శాతం , బాబుకు 36 శాతం మంది మద్దతు తెలుపుతున్నట్లు చెపుతుంది.

ఇక జనసేన అధినేత పవన్ విషయానికి వస్తే గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఐదు శాతం ఉండగా , ప్రస్తుతం నాలుగు శాతం కు పడిపోయిందని తెలిపింది. జగన్ , బాబు ల మధ్య వ్యత్యాసం తక్కువే కాబట్టి ఎన్నికల నాటికీ ఏమైనా జరగొచ్చు అంటుంది. ఈ సర్వే పట్ల టీడీపీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాబోయేది చంద్రబాబే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.