బీచ్ లో చిక్కుకున్న మంత్రి గంటా కారు..

పెథాయ్ తుఫాన్ కారణంగా సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వెళ్లిన ఏపీ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కారు ఇసుకలో కూరుకుపోయింది. భీమిలి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను పరామర్శించడానికి టొయోటా ఫార్చ్యూనర్ కారులో గంటా వెళ్లారు. అయితే బీచ్‌ వద్ద ఇసుకలో నుంచి డ్రైవర్ కారును పోనివ్వడంతో చక్రాలు కూరుకుపోయాయి. దీంతో సహాయక సిబ్బంది దాదాపు గంటకు పైగా కష్టపడి కారును బయటికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం పెథాయ్ తుఫాన్ బలహీన పడి ఒడిశా దిశగా పయనిస్తుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తీరం దాటినా గానీ తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ ఫై పెథాయ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గంటకు 80 నుండి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. కోస్తా అంత నిన్నటి నుండి విస్తారంగా వర్షాలు పడుతుండడంతో అపారమైన ఆస్థి నష్టం వాటిల్లిందని తెలుస్తుంది.