గంటా క్లారిటీ ఇచ్చాడుగా..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడి రాజకీయాలే మారిపోయాయి..వైసీపీ విజయ భేరి మోగించడం..ఇతర పార్టీలో గెలిచినా అభ్యర్థులకు పెద్దగా జగన్ ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో ఆయా పార్టీల నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం..మరికొంతమంది చేరుతారనే వార్తలు బలంగా వినిపించడం తో ఎవరు ఎప్పుడు చేరుతారనే ఆసక్తి ప్రజల్లో పెరిగింది.

ముఖ్యంగా తెలుగుదేశం మాజీ మినిస్టర్ గంటా శ్రీనివాస్ రావు.. తనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యే లను బీజేపీ లో చేరుతారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తల ఫై గంటా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారన్న గంటా…ఆ వార్తలకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల ముందు, తర్వాత మరియు ఇప్పుడు కథనాలు వచ్చాయని వెల్లడించారు. ఎప్పటికప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ మారే ప్రసక్తే లేదని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.