జగన్ మరో తీపి కబురు..ఆనందం లో ప్రజలు ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గరినుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆనందంలో పడేస్తున్న జగన్ ..తాజాగా మరో నిర్ణయం తీసుకొని ప్రజల్లో సంబరాలు నింపారు .ఇప్పటి వరకు పండ్లు, పూల తోటల విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ రాగా..జగన్ మాత్రం ఆ రైతులకు ఆనందకరమైన నిర్ణయం తీసుకున్నారు.

భూసేకరణ జరిగినపుడు పండ్లు, పూల తోటలు ఉంటె వారికి నష్టపరిహారం చాలా తక్కువగా ఉండేది. కానీ, జగన్ ఆ నష్టపరిహారాన్ని ఇప్పుడున్నడానికి మూడింతలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.గతంలో మామిడి చెట్టుకు రూ. 2600 మాత్రమే ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ ధర మూడు రేట్లు పెరిగింది. ఇలా అన్నింటిపై నష్టపరిహారం పెంచారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై హర్షం చేస్తున్నారు.