జగన్ కొత్త జిల్లాలను ప్రకటించబోతున్నాడా..?

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైస్సార్సీపీ అధినేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు..అలాగే రాష్ట్రంలో కొన్ని కొత్త జిల్లాలను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఎంపీ స్థానానికి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి, అంటే జిల్లాల పునర్వవస్థీకరణ చేస్తానని జగన్ తన ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు.

జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొత్త జిల్లాల ప్రకటన లేదా జిల్లాల పునర్వవస్థీకరణను ప్రకటిస్తారని, నేరుగా కొత్త జిల్లాలను ప్రకటించడం లేదా, పునర్వవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించడం కానీ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్వతీపురం, అరకు (గిరిజన జిల్లా), అనకాపల్లి, తూర్పుగోదావరిలో రాజమండ్రి, పశ్చిమగోదావరిలో భీమవరం లాంటి ఊళ్లు జిల్లా కేంద్రాలుగా ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక ఈ నెల 30 న విజయవాడ లో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ప్రధాని మోడీ..ఇతర రాజకీయ నేతలు హాజరు కాబోతారని సమాచారం. ఈరోజు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను జగన్ సతీసమేతంగా కలిసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరారు.