పరిటాల కుటుంబఆయుధ పూజ చూసారా..?

దసరా రోజు చాలామంది తమ వాహనాలకు లేదా తాము చేసుకొనే వృత్తి పనిముట్లకు ఆయుధ పూజ చేయడం మనం చూస్తుంటాం..ఇది ఈరోజుది కాదు ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ. అయితే పరిటాల కుటుంబం మాత్రం ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.

రాజకీయనేతలకు సెక్యూరిటీ గార్డులు ఉండడం , వారి చేతిలో గన్నులు, ఆయుధాలు ఉండడం కామన్.. అయితే ఆ సెక్యూరిటీ సిబ్బంది చేతిలో ఉన్న ఆయుధాలకు పూజలు చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేసారు పరిటాల ఫ్యామిలీ. ఈ ట్రెండ్ చూసి నెటిజన్లతో పిచ్చి పిచ్చి గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది చేతిలోని ఆయుధాలకు పూజలు చేయడం ఏంటి…? ఇలా చేయడం , వారి దగ్గరి నుండి ఆయుధాలు తీసుకోవడం నేరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద మరోసారి పరిటాల ఫ్యామిలీ ఈ పూజ తో మరోసారి వార్తల్లో నిలిచారు.