రాహుల్ ఏపీ పర్యటన డీటెయిల్స్..

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భాంగా కాంగ్రెస్ నాయకులూ , కార్యకర్తలు ఆయన పర్యటనను విజయవంతం చేయాలనీ భారీ ఏర్పాట్లే చేసారు. ఎస్టీబీసీ మైదానంలో లక్ష మందితో జరిగే బహిరంగసభలో రాహుల్ ప్రసంగిస్తారు.

* మంగళవారం మధ్యాహ్నం 12.15 గం.లకు స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా రాహల్‌ గాంధీ చేరుకుంటారు. నేరుగా మాజీ సీఎం దామోదర సంజీవయ్య ఇంటికి చేరుకొని అయన కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు.

* ఆ తర్వాత ఒంటి గంటకు బైరెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులతో పలు విషయాలపై చర్చించనున్నారు.

* 2.45కి దివంగత సీఎం విజయ్‌ భాస్కర్‌ రెడ్డి సమాధి(కిసాన్‌ ఘాట్‌) వద్దకు చేరుకొని పుష్పాంజాలి ఘటిస్తారు.

* 3:45కు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సభ పూర్తికాగానే హైదరాబాద్ కు చేరుకుంటారు.

2015లో అనంతపురం పర్యటనలో ప్రత్యేక హోదా అంశాన్ని రాహుల్‌ ప్రస్తావించారు. మళ్లీ ఇప్పుడు ఇవే అంశాలను మరోసారి కర్నూలు బహిరంగసభలో ప్రస్తావించే అవకాశాలున్నాయి.