షర్మిల దెబ్బకు దిగివస్తున్న యూట్యూబ్ చానెల్స్..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇటీవల తనపై సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారం చేస్తున్నారని వారిపై వెంటనే చర్య తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల పిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖా వెంటనే వారిపై యాక్షన్ కు సిద్ధమైంది.

సోషల్ మీడియాతో పాటూ యూ ట్యూట్ ఛానల్స్‌లో అసత్య ప్రచారం చేసిన వారిని పోలీస్ శాఖా గుర్తించారు. ముఖ్యంగా 60 వీడియోలను సేకరించి.. బాధ్యులపై చర్యలు ప్రారంభించారు. దాదాపు 15మందిని గుర్తించి.. వారిలో ఐదుగుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అనంతరం వీరికి సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు.

ఈ ఐదుగురితో పాటూ మరికొందరికి నోటీసులు పంపి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వీడియోలు, ఆడియోలను తయారు చూపిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. వీడియో పోస్ట్‌ చేసిన వారితో పాటు ఈ కామెంట్స్‌ చేసిన వ్యక్తులు కూడా నిందితులుగా చేర్చి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దెబ్బతో ఇప్పుడు పోస్ట్ పెట్టడమే కాదు కామెంట్స్ చేసేవారు సైతం భయపడుతున్నారు.