ఏపీలో రెండు లక్షలు దాటినా కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉదృతి ఏ స్థాయి లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకు కొత్త కేసులే కాదు భారీ సంఖ్యలో మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. కరోనా బారిన సామాన్య ప్రజలే కాక రాజకీయ నేతలు సైతం భారీగా పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి.

గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 10,171 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కరోనాతో కొత్త‌గా 89 మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్​తో ఇప్పటివరకు రాష్ట్ర‌వ్యాప్తంగా 1,842 మంది చ‌నిపోయారు. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరులో 10 మంది, అనంతపురంలో 9 మంది, గుంటూరులో 9 మంది, నెల్లూరులో 9 మంది, పశ్చిమ గోదావరిలో 9 మంది, తూర్పు గోదావరిలో ఏడుగురు, కడపలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కృష్ణాలో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

కరోనా కేసుల విషయానికి వస్తే ..

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,331 కరోనా పాజిటివ్ కేసులు
తూర్పుగోదావరిలో 1,270
అనంతపురంలో 1,100
చిత్తూరులో 980
నెల్లూరులో 941
విశాఖలో 852
గుంటూరులో 817
కడపలో 596
పశ్చిమగోదావరిలో 548,
విజయనగరంలో 530,
శ్రీకాకుళంలో 449,
కృష్ణాలో 420,
ప్రకాశం జిల్లాలో 337లో కరోనా కేసులు నమోదయ్యాయి.