జగన్ ఐడియా కు కరోనా రోగులు హ్యాపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు లక్షల చేరువలో కేసులు ఉన్నాయి. కేసులు తగ్గించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ , కేసులు మాత్రం కంట్రోల్ లోకి రావడం లేదు. ఇక ఈ సంగతి పక్కన పెడితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కరోనా రోగుల్లో ఆనందం నింపుతుంది.

ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, నర్సులు పట్టించుకోవడం లేదని వదంతులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా రోగుల వద్ద బెల్ సౌకర్యం ఉంచాలని నిర్ణయించింది. ప్రతి కరోనా బెడ్ వద్ద బెల్ ను అందుబాటులో ఉంచబోతున్నది. ఈ బెల్ ను ఆసుపత్రి రిసెప్షన్ తో అనుసంధానం చేస్తారు.

రోగి బెల్ నొక్కినప్పుడు నర్సు లేదా అందుబాటులో ఉన్న డాక్టర్ రోగి వద్దకు వెళ్లి తగిన సలహాలు సూచనలు ఇస్తారట. రాష్ట్రంలోని అన్ని ఐసీయూ, నాన్ ఐసియూ, ఆక్సిజన్, జనరల్ వార్డుల్లో ఈ బెల్ సౌకర్యం కల్పించబోతున్నారు. దీనిద్వారా ఎమర్జెన్సీ ఉన్న రోగులను గుర్తించడం ఈజీ అవుతుందని వైద్య ఆరోగ్యశాఖ చెప్పుకొచ్చింది.