ధర్మాబాద్‌ కోర్టుకు చంద్రబాబు వెళ్లడం లేదు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆయనతో సహా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

కాగా ఈ ఘటనకు సంబంధించి కోర్టు నోటీసులు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన తరపున న్యాయవాదిని ధర్మాబాద్ న్యాయస్థానానికి పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం తరపున న్యాయవాదులు వెళ్లి నాన్ బెయిల్‌పై రీకాల్ పిటిషన్ చేయనున్నారు.ఈ నెల 22న ఐక్యరాజ్యసమితిలో పాల్గొనే అరుదైన అవకాశం ఉన్నందు తన బదులు న్యాయవాదులను కోర్టుకు పంపాలని చంద్రబాబు నిర్ణయించారు.