అవిశ్వాసంపై శుక్రవారమే చర్చ

టీడీపీ అనుకొన్నది సాధించింది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తెదేపా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తెదేపా ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తెదేపా ఎంపీల అవిశ్వాస తీర్మానం అందిందని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించి.. దాన్ని సభ ముందు ఉంచారు. 50 మందికిపైగా సభ్యులు మద్దతుగా లేచినిలబడటంతో స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. చర్చపై తేదీని బీఏసీ సమావేశంలో ఖరారు చేశారు. ఈ శుక్రవారం చర్చ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ, ఎంఐఎం, ఆర్జేడీ, ఆరెస్పీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌ తమ మద్దతు ప్రకటించగా.. తెరాస, బీజేడీ పార్టీలు తమ మద్దతును ప్రకటించలేదు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంతో కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చలేరు. ఈ విషయం టీడీపీకి తెలుసు. ఐతే, ఏపీకి అన్యాయం జరగడంపై దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతుని సంపాదించడం. ఈ విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టడంలో సక్సెక్ అవ్వనున్నారు.