‘అమ్మవడి’ అందరికీ… వాట్ థిస్ జగన్ ?

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. పాదయాత్ర చేసిన సందర్భంగా చాలా హామీలు ఇచ్చారు. అందులో ‘అమ్మవడి’ వుంది. తన బిడ్డని స్కూల్ కి పంపుతున్న ప్రతి తల్లికి 15వేల రూపాయిల చెక్ ని క్యాష్ సపోర్ట్ గా ఇస్తానని మాటిచ్చారు. దీనిపై ఒక అనుమానం వుండేది. చెక్ ఇచ్చేది ప్రభుత్వం బడులకు పంపే తల్లికేనా? అనే సందేహం. అయితే తాజాగా తమ పిల్లల్ని ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో దేనికి పంపించినా సరే ‘అమ్మ ఒడి’ పథకం వర్తిస్తుందని ప్రకటించారు.

ఈ నిర్ణయాన్ని స్వాగతించాలా వ్యతిరేకించాలో అర్ధం కాని పరిస్థితి కొందరిది. ‘అమ్మవడి’ పధకం బావుంది. పేద తల్లులకి ఈ పధకం వర్తింపజేస్తే ఆక్షరాస్యత పెరుగుతుంది. కానీ జగన్ మోహన్ రెడ్డి అందరికని అంటున్నాడు. నిజంగా ఇదే అమలు జరిగితే.. ఇంక ప్రభుత్వ బదులు ఎత్తేయవచ్చు.

పదిహేను వేలు వచ్చిన తల్లితండ్రులు తమ పిల్లలకి ప్రైవేట్ స్కూల్ లో చదివించాలని అనుకుంటారు కానీ ప్రభుత్వ బడులకు ఎందుకు పంపుతారు. ?! ఇప్పటికే ప్రభుత్వ బడుల తీరు దారుణంగా వుంది. యాబై వేలు జీతం తీసుకునే టీచర్లు వున్న ప్రభుత్వ బడుల్లో వచ్చే రిజల్ట్ కంటే పది వేలు జీతం తీసుకుని ప్రైవేట్ స్కూల్ లో చెప్పే ఉపాధ్యాయులు మంచి రిజల్ట్స్ తీసుకోస్తున్నారు. ఈ వ్యవస్థ లో బోలెడు డొల్లతనం వుంది. ఇప్పుడు గానీ జగన్ మోహన్ రెడ్డి ‘అమ్మవడి’ అందరికీ అంటే అంటే ఇంక ప్రభుత్వ బడులు సంగతి అంతే. స్వయంగా జగన్ మోహన్ రెడ్డే ప్రభుత్వ బడులకు మంగళం పడేశారని చెప్పుకోవచ్చు. ఏంటో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం!