ఈరోజే జనసేన కవాతు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన కవాతుకు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ సిద్దమైంది. సోమవారం పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్రను తూర్పుగోదావరి జిల్లాలో మొదలు పెట్టనున్న నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ కవాతు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పిచ్చుకల్లంక వద్ద ప్రారంభమయ్యే కవాతు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర సాగుతుంది. అనంతరం బ్యారేజీ దిగువన ఉన్న కాటన్‌ విగ్రహం వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పవన్‌ ప్రసంగిస్తారు.

ఇప్పటికే కవాతు ఏర్పాట్లన్నీ జనసేన నేతలు , కార్య కర్తలు పూర్తి చేసారు. పవన్‌ కల్యాణ్ సోమవారం విజయవాడ నుంచి బయలుదేరి ఒంటి గంటకు పశ్చిమగోదావరి జిల్లాకు, అక్కడి నుంచి విజ్జేశ్వరం మీదుగా పిచ్చుకల్లంక వద్ద కాటన్‌బ్యారేజీ మీదకు చేరుకుని కవాతును ప్రారంభిస్తారు. ఈ కవాతుకు హాజరయ్యేవారు జాతీయ స్ఫూర్తితో పాల్గొని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌లో తెలియజేసారు.

వాహనాలపై వచ్చే వారు నిదానంగా రావాలని ‘మీ క్షేమమే నాకు ప్రథమ బాధ్యత. బైకులపై వేగంగా వెళ్లాలనిపించినప్పుడు మీ తల్లిదండ్రులను, నన్ను గుర్తుపెట్టుకుని నెమ్మదిగా రండి. మీ ఉత్సాహాన్ని కవాతులో చూపించండి. బైక్‌యాక్సిలేటర్లతో శబ్దాలు చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. క్రమశిక్షణతో ముందుకెళ్దాం. కలిసి నడుద్దాం’ అని ట్విట్టర్‌లో అభిమానులకు సూచించారు.