టీడీపీ కి రాజీనామా చేస్తానని జేసీ ప్రకటన…

జేసీ దివాకర్‌రెడ్డి..ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు..ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి. సొంత పార్టీ తప్పు చేసిన..దానిని తప్పు అని చెప్పగల సమర్దడు. అలాంటి ఈయన తాజాగా తన డిమాండ్లను నెరవేర్చకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు వేడి వేడిగా మొదలు అయినప్పటికీ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా జేసి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

తాజాగా మీడియా తో మాట్లాడిన జేసి.. తన నియోజకవర్గం పరిధిలోని అభివృద్ధి పనులు, రాజకీయ అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకువచ్చిన ఈనెల 25వ తేదీ లోగా తన డిమాండ్లు పరిష్కరించకుంటే రాజీనామా చేస్తానని ప్రకటించి షాక్ ఇచ్చాడు. అనంతపురంలో ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించిన జేసీ… పార్టీలోకి వస్తామన్న వారిని కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన డిమాండ్లు పరిష్కారం అయితేనే పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతానని స్పష్టం చేశారు.