ఎంపీ కవితకు అస్వస్థత

టీఆర్ఎస్ ఎంపీ కవిత అస్వస్థతకి గురయ్యారు. ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది. దీంతో ఆమెను హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ ఆసుపత్రికి కాసేపట్లో ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఐతే, భయపడాల్సింది ఏమీ లేదు. ఎన్నికల ప్రచారంలో విశ్రాంతి లేకుండా తిరిగడం కారణంగా ఆమె అస్వస్థతకు గురయ్యారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

అనారోగ్యం కారణంతో కవిత నేటి ఎన్నికల ప్రచారం వాయిదా పడింది. నిజామాబాద్ ఎంపీగా వ్యవహరిస్తున్న కవిత.. ఆ జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతాన్ని తన భుజాలపై వేసుకొన్నారు. సీనియర్ నేత డీఎస్ వ్యవహారంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించినట్టు సమాచారమ్. నిజామాబాద్ కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్న కేసీఆర్.. కూతురు సలహా మేరకే నడుచుకుంటారని జిల్లా నేతలు చెప్పుకుంటుంటారు.