కొలంబో పేలుళ్లని ఖండించిన కేసీఆర్


శ్రీలంక రాజధాని కొలంబోలో ఐసిన్ ఉగ్రవాదులు మారన హోమం సృష్టించిన సంగతి తెలిసిందే. కొలంబోని మూడు చర్చీలు, మూడు హోటల్లో ఆత్మహుతి దాడికి పాల్పడ్దారు. ఈ ఘటనలో 160మందికి పైగా మృతి చెందారు. మరో 400మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు ఐసిస్ ఆత్మాహూతి దళ సభ్యులు పనేనని తేలింది. ఈ మేరకు శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.

భారత రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనని ఖండించారు. శ్రీలంకకి బాసటగా ఉంటామని ప్రధాని ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాంబు దాడులను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తునన్నారు.