జనసేనపై మహా మూర్తి రియాక్షన్ ఇది

హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సమావేశం నిర్వహించారు. దీనిపై ఓ కధనంను మహాటీవీ ఛానల్ లో ప్రసారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. హోటల్ లో జరిగిన సమావేశం, దాని లక్ష్యాలకు పూర్తి విరుద్ధంగా కక్షగట్టినట్టుగా జనసేన పార్టీ మీద బురదచల్లడానికి మహా టీవీ లో జర్నలిస్ట్ మూర్తి ప్రయత్నించారని జనసేన అభిమానులు ఆరోపించారు. వాళ్ళ సొంత రిపోర్టర్ సైదా బాబు కథనం సవ్యంగా ఉన్నా కూడా, దానికి కూడా భిన్నంగా జర్నలిస్ట్ మూర్తి ఆ సమావేశానికి కులం ముద్ర వెయ్యడానికి ప్రయత్నించారని చెప్పారు.

కాగా చానల్ యాజమాన్యం.. వెంటనే టెలికాస్టింగ్‌ను ఆపేయాలని ఆదేశించడంతో.. ఆయన చానల్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పట్నుంచి జనసేన, కల్యాణ్ ఫ్యాన్స్, మూర్తిని టార్గెట్ చేశారు. అసత్యాలు ప్రచారం చేశారనే మూర్తిని తీసేశారని పోస్టులు పెట్టారు. అది సీక్రెట్ మీటింగ్ కాదని… ఇన్విటేషన్లు పంపి మరీ జరిగిన మీటింగ్ అన్నారు. అంతిమంగా మూర్తి అవినీతి పరుడు కోట్లు సంపాదించాడని కూడా పోస్టులు పెట్టారు.

మహాటీవీ నుంచి బయటకు వెళ్లిపోయిన మూర్తి… ఈ పోస్టులన్నింటిని చూసి.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని తాజాగా ఖండించడానికి ఓ యూట్యూబ్ చానల్‌లో… వివరణ ఇచ్చారు. దాదాపుగా 18 నిమిషాల పాటు… తన నిజాయితీ గురించి చెప్పారు.తను జర్నలిజంను నమ్ముకొని వచ్చానని, అమ్ముకొని కాదని, ఇలాంటి బెదిరింపులకు భయపడనని చెప్పుకొచ్చారు.