ఎమ్మెల్సీ రాములుపై వేటు పడింది

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ పై వేటుపడింది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యలో ఆయనపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సస్పెండ్‌ వేటు వేసింది. మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్‌ లేదా ఇతర స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని రాములు నాయక్‌ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానంతో ఎప్పటి నుంచో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఐతే, దీనిపై ఆయనకు అధిష్టానం నుంచి హామీ లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. నిన్న కుంతియాతో పాటు కాంగ్రెస్‌ అగ్రనేతలను ఆయన కలిసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీన్ని ఆయన ఖండించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో తన భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం రాములు ప్రకటించారు. ఐతే, అంతకంటే ముందే ఆయన పార్టీ చర్యలు తీసుకొంది.