పవన్ పెళ్లికి జగన్ జైలుకి లింక్ ఏమిటి ?


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను సమస్యలు ప్రస్తావిస్తే తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారని, అందువల్ల ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.కావాలంటే ఆయన చేసుకోవచ్చని అన్నారు. తాను చేసుకున్న పెళ్లిళ్ల వల్లే రెండేళ్ల జైలుకు వెళ్లారా? అని ఆయన ప్రశ్నించారు.

“నేనెప్పుడూ మీ వ్యక్తిగతంపై మాట్లాడలేదు. మిమ్మల్నే కాదు మీ ఎమ్మెల్యేలపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ ఓ స్థాయి దాటిందంటే మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడాలో చాలా బలంగా తెలిసినవాడ్ని” అంటూ హెచ్చరించారు.