ఆర్టీసీ సమ్మెపై కోర్టు కమిటీ

తెలంగాణ ఆర్టిసి సమ్మెపై హైకోర్టు ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని,దీనిపై ప్రభుత్వం తన అభిప్రాయం తెలపాలని హైకోర్టు కోరింది.

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా.. సమ్మె చట్టవిరుద్ధం అని ఆదేశించడానికి కోర్టుకు ఉన్న పరిధి, అధికారాల గురించి సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ తన వాదనలు వినిపించారు.

ఇందుకు బదులుగా… సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని దీనిపై ప్రభుత్వం తన అభిప్రాయం తెలపాలని కోరింది.