రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన శివసేన


మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి సిఫార్సుకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు మంగళవారం మధ్యాహ్నం జరిగిన కేంద్ర క్యాబినెట్‌ భేటీ ఆమోద ముద్ర వేసింది . ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సంఖ్యా బలం లేనందున గవర్నర్‌ సిఫార్సును పరిగణనలోకి తీసుకుని కేంద్ర క్యాబినెట్‌ రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదించింది.

ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టును శివసేన ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్ తక్కువ సమయాన్ని ఇచ్చారంటూ పిటిషన్ వేసింది. బీజేపీకి 48 గంటల సమయాన్ని గవర్నర్ ఇచ్చారని, తమకు మాత్రం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇచ్చారని తెలిపింది. బీజేపీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహారశైలి ఉందని ఆరోపించింది.