కళ్యాణ్ రామ్ ఫై వచ్చిన పుకారు చూసారా..?

ఈ మధ్య పలు మీడియా ఛానల్స్ లలో పుకార్లకు కొదవలేకుండా పోతుంది..తమ తమ టీఆర్పీ రేటింగ్ లకోసం ఎవ్వరు నమ్మలేని వార్తలు సైతం ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ఛానల్ వారు కళ్యాణ్ రామ్ రాజకీయాల ఫై ఓ వార్త ప్రచారం చేసారు. త్వరలో ఆయన తెలంగాణ మహాకూటమి కోసం రాబోతున్నట్లు ప్రచారం చేసారు. ఈ వార్త చూసి నమ్మడం అటుంచి అంత నవ్వుకోవడం మొదలు పెట్టారు.

గత కొంతకాలం గా కళ్యాణ్ రామ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన సినిమాల ఫై తప్ప మరోదానిపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. ఇటీవల తండ్రి మరణం కూడా ఈ కుటుంబాన్ని మరింత కుంగదీసింది. కుటుంబ భారం అంత ఇప్పుడు కళ్యాణ్ రామ్ పైనే పడింది. ఇలాంటి టైం లో కళ్యాణ్ రామ్ మహాకూటమి కోసం వచ్చే ఎన్నికల్లో తన వంతు ప్రచారం చేయబోతున్నాడని ప్రచారం చేయడం అందరి చేత నవ్వులు తెప్పిస్తుంది. ఈ వార్త పట్ల కళ్యాణ్ రామ్ సన్నిహితులను అడుగగా వారు కూడా ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఆయన సినిమాల మీద, సినిమా నిర్మాణాల మీద, ఇతర వ్యాపారాల మీద సీరియస్ దృష్టితో వున్నారని తమ ఛానల్ ప్రచారం కోసమే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని వారు వాపోతున్నారు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ లో తనతండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో పాటు గుహన్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.