తెలంగాణ సీఎం కేటీఆర్..?

తెలంగాణ రాష్ట్రానికి అతి త్వరలో కేటీఆర్ ముఖ్య మంత్రి కాబోతున్నాడా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాననీ, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కేసీఆర్ చెపుతున్నప్పటికీ. త్వరలోనే కేటీఆర్ సీఎం కుర్చీ ఎక్కబోతున్నారనే ప్రచారం మాత్రం సాగుతోంది.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని భావిస్తున్న ఆ పార్టీ వర్గాలు… ఆ క్రెడిట్ మొత్తం కేటీఆర్ ఖాతాలో వేసి… ఆయన్ను సీఎం కుర్చీ ఎక్కిస్తారని తెలుస్తోంది. ఐతే… కేటీఆర్ మాత్రం తనకు అలాంటి అత్యాశలు లేవనీ, తెలంగాణ ఆల్రెడీ కేసీఆర్ సారధ్యంలో పురోగమిస్తోందనీ స్పష్టం చెపుతున్నారు. మరి నిజంగా కేటీఆర్ సీఎం కుర్చీ ఎక్కుతాడా..? లేక బయట ప్రచారం కేవలం పుకార్లేనా అనేది చూడాలి.