ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేటీఆర్ ఏమన్నాడో తెలుసా..?

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌లో వేద పండితుల ఆశీర్వచనాల తర్వాత.. కేటీఆర్ తన కేబిన్‌లో కూర్చొన్నారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన యువ నేతకు హోంమంత్రి మహమూద్ అలీ, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ..మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మల్చడానికి పెద్దలు కేసీఆర్ నాకు ముఖ్యమైన బాధ్యత అప్పజెప్పారు. బంగారు తెలంగాణ కోసం సవ్యంగా పని నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

అంతకముందు.. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరే ముందు కేటీఆర్.. తల్లిదండ్రులు కేసీఆర్, శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత సోదరి కవిత ఆయన నుదుట తిలకం దిద్ది హారతి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.