పుల్వామా ఘటన పై డోనాల్డ్‌ ట్రంప్‌ రియాక్షన్

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై భీకర ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అదిల్‌ అహ్మద్‌ దర్‌ అనే ఉగ్రవాది సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై‌ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో తీవ్ర శోకంలో మునిగిపోయిన దేశం.. ఈ అమానుషమైన చర్యకి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకునేలా చేయవలసిందేననీ, మరోసారి సర్జికల్ స్ట్రైక్ తో ప్రతీకారం తీర్చుకోవలసిందేననే రగిలిపోతున్నారు.

కాగా పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దాడిని భయానక చర్యగా అభివర్ణించారు. ‘‘దాడిపై మాకు నివేదికలు అందాయి. నేను వాటిని పరిశీలించాను. అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. సరైన సమయంలో దీనిపై స్పందిస్తాం. రెండు దేశాలు కలిసి నడిస్తే బాగుంటుంది’’ అని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.