రివ్యూ : ‘ 90 ML ‘ కిక్ ఇవ్వలేదు

స్టార్ కాస్ట్ : కార్తికేయ, నేహా సోలంకి, రోల్ రైడ, రావు రమేష్, ప్రగతి, సత్య ప్రకాష్ తదితరులు..
దర్శకత్వం : యెర్ర శేఖర్ రెడ్డి
నిర్మాతలు: అశోక్ రెడ్డి గుమ్మకొండ
మ్యూజిక్ : అనూప్
విడుదల తేది : డిసెంబర్ 06, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : ’90 ML ‘ – సరిపోలేదు..

RX100 తో భారీ విజయం అందుకున్న కార్తికేయ..ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రీసెంట్ గా నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. తాజాగా తాను హీరో గా 90 ML చిత్రం తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాతో నూతన దర్శకుడు శేఖర్ రెడ్డి ని ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా..కార్తికేయ హోమ్ బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించబడింది. టీజర్ , సాంగ్స్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచగా..మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

దేవదాసు (కార్తికేయ) పుట్టడమే ఫేటల్ ఆల్కహాలిక్ డిజస్దర్‌తో పుడతాడు. దీంతో అతడికి రోజు ఆల్కహాల్ తాగించమని డాక్టర్స్ చెపుతారు. ఆలా చిన్నప్పటి నుండే ఆల్కహాల్ కు అలవాటు పడతడు. రోజుకి మూడు పూటలా కూడా 90ML తాగాల్సి ఉంటుంది. ఒక వేళ అలా తాగకపోతే అతని ప్రాణాలకే ప్రమాదం.

ఈ నేపథ్యంలో సువాసన(నేహా సోలంకి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు దేవదాసు. కానీ సువాసనకి, ఆమె ఫ్యామిలీకి మాత్రం అసలు అలాంటి అలవాట్లు ఉన్నవాళ్లు నచ్చరు. కానీ దేవదాసు రోజు 90ML తాగే అలవాటు ఉందని తెలియక అతనితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకొని దేవదాసు కు దూరం అవుతుంది..ఆలా దూరమైన సువాసన..మళ్లీ దేవదాసు కు దగ్గరవుతోందా..లేదా..? దేవదాసు అలవాటు మానేస్తాడా లేదా..? అనేది మీరు సినిమా చూడాల్సిందే..

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* కార్తికేయ యాక్టింగ్

* నిర్మాణ విలువలు

మైనస్ :

* సెకండ్ హాఫ్

* క్లైమాక్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* గత చిత్రాలతో పోలిస్తే కార్తికేయ యాక్టింగ్ లో మార్పులు కనిపించాయి. కామెడీ టైమింగ్ పర్లేదు అనిపించింది.

* ఇక కొత్త హీరోయిన్ నేహా సోలంకి ఉన్నంతలో బాగానే చేసింది. ఈమె రోల్ కాస్త పాసివ్ క్యారెక్టర్ కావడంతో పెద్దగా నటించాల్సిన అవసరంలేదు.

* రోలర్స్ రఘు కామెడీ బాగానే పేలింది. ఇక ఇప్పటివరకు రాప్ సింగర్‌గా ఉన్న రోల్ రైడా ఈ సినిమాలో హీరో పక్కనే ఉండి కామెడీ పండించే పాత్రలో బాగానే ఇమిడిపోయాడు.

* ప్రధాన విలన్ గా రవికిషన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మేల్ ఫిమేల్ కాంబినేషన్ కాస్ట్యూమ్స్ లో ఆయన చేసే కామెడీని విసుగు తెప్పించింది.

* కార్తికేయ తల్లిదండ్రులుగా చేసిన ప్రగతి, సత్య ప్రకాష్ లు తమ పరిధిలో చక్కని నటన కనబరిచారు.

* రావు రమేష్ ఎప్పటిలాగే తన మార్కు నటనతో అలరించారు. ఇక మిగతా నటి నటులంతా కూడా వారి పరిధి మేరకు ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగం :

* అనూప్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది..నేపధ్య సంగీతం బాగుంది.

* నిర్మాణ విలువలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించని ఫారెన్ పాటలు మళ్ళీ ఈ సినిమాలో రెండు కనిపించాయి.

* ఎడిటింగ్ పూర్తిగా నిరాశ పరుస్తుంది. ఈ జోనర్ వచ్చే సినిమాలకు తక్కువ నిడివి ఉన్నప్పుడే ఆకట్టుకుంటాయి.

* సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..నూతన డైరెక్టర్ శేఖర్ రెడ్డి సినిమా ఫస్టాఫ్ అంతా కూడా కమర్షియల్ పాయింట్స్‌ని డీల్ చెయ్యడంపై తనకు ఉన్న పట్టు చూపించాడు. ఇక ఫైట్స్ అండ్ సాంగ్స్ విషయంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్స్ దొరకడంతో అవి కూడా చాలా నీట్‌గా కుదిరాయి. సినిమాలో పెద్దగా కొత్తదనం లేకపోయినా ఉన్న కంటెంట్‌లో ఎంటర్టైన్మెంట్ జోడించి బాగానే నడిపించాడు.

ఇంటర్వెల్ వరకు బాగానే నడిపించిన శేఖర్.. సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ హీరోని మార్చడానికి, మందు మాన్పించడానికి చేసిన ప్రయత్నాలు లాంటివి అన్నీ కూడా తేలిపోయాయి. తనకు ఉన్న డిసీజ్ గురించి చెబితే సరిపోయే దానికి ఇంత సినిమా నడిపించాల్సిన అవసరం ఏంటి అనిపిస్తుంది. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం బాగా రాసుకున్నప్పటికీ వాటిని తెరపై సరైన క్రమంలో పేర్చిడంలో విఫలం చెందారు.

కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత సెకండ్ హాఫ్ లో రాసుకోలేకపోయాడు. మెయిన్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్ వెరైటీ గెటప్‌తో అసలు అతను విలనా? లేక కమెడియనా అనే విషయం కూడా అర్ధం కానీ పరిస్థితి..ఇక క్లయిమాక్స్ కూడా కొత్తగా ఏమీ లేదు. హీరోయిన్ వచ్చి హీరోకి ఒక లిప్ లాక్ ఇవ్వగానే అతను లేచి విలన్స్‌ని కొట్టి తన ప్రేమని గెలుచుకుంటాడు. ఓవరాల్ గా టైటిల్ లో కిక్ సరిపోలేదు…ఇంకొచెం ఎమ్ ఎల్ పోస్తే బాగుండు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

Click here for English Review