రివ్యూ : అల వైకుంఠపురం లో – ఫ్యామిలీ ఎంటర్టైనర్

స్టార్ కాస్ట్ : అల్లు అర్జున్ , పూజా హగ్దే , సుశాంత్ తదితరులు..
దర్శకత్వం : త్రివిక్రమ్
నిర్మాతలు: అల్లు అరవింద్ , చినబాబు
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : జనవరి 12, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

రివ్యూ : అల వైకుంఠపురం లో – ఫ్యామిలీ ఎంటర్టైనర్

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ మూవీలోని అన్ని పాటలు ఏ రేంజ్ లో అలరించాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటలతోనే సినిమాకు ఫుల్ క్రేజ్ వచ్చింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ అందించిన క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పూజా హగ్దే హీరోయిన్ గా నటించడం..టబు , జయరాం , సుశాంత్, నవదీప్ , సునీల్ , సముద్రఖని , రాజేంద్ర ప్రసాద్ మొదలగు స్టార్ నటి నటులు ఈ సినిమా లో నటించడం .. గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా నిర్మించడం తో ఈ మూవీ ఫై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంది..? త్రివిక్రమ్ బన్నీ ని ఎలా చూపించాడు..? అసలు సినిమా కథ ఏంటి అనేది..ఇప్పుడు చూద్దాం.

కథ :

బంటు (అల్లు అర్జున్) అంటే తన తండ్రి వాల్మీకి (మురళీ శర్మ)కి ఏమాత్రం ఇష్టం ఉండదు. తనకు కావాల్సింది ఇవ్వకపోవడం, సరిగ్గా చూడకపోవడం చేస్తూ ఉంటాడు. దాంతో చిన్నప్పటినుండి తండ్రి అంటే ఇష్టం లేకుండానే పెరుగుతాడు. అమూల్య(పూజా హెగ్డే) ఓ టూరిజం కంపెనీ న‌డుపుతుంటుంది. ఆమె అసిస్టెంట్‌గా బంటు జాయిన్ అవుతాడు. అల..బంటు..అమూల్య ను ప్రేమించడం మొదలు పెడతాడు.

ఇదిలా జరుగుతుండగా రామ చంద్ర (జయరాం) తన కొడుకు రాజ్ ( సుశాంత్ ) కు అమూల్య ను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రామ చంద్ర బిజినెస్ పై కన్నేసిన విలన్ (సముద్రఖని) అతనిపై దాడి చేయిస్తాడు. ఈలోపు బ‌న్నీకి అస‌లు విష‌యం తెలిసి అల వైకుంఠ‌పుర‌ములోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? అసలు బంటు కు తెలిసిన నిజం ఏంటి..? బంటు కు వైకుంఠ‌పుర‌ము కు లింక్ ఏంటి..? బంటు – అమూల్య ప్రేమ ఏమవుతుంది..? అసలు మురళి శర్మ కు బంటు అంటే ఎందుకు ఇష్టం ఉండదు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* కథ

* అల్లు అర్జున్

* మ్యూజిక్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* ఎడిటింగ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* అల్లు అర్జున్ యాక్టింగ్ , డాన్స్ , యాక్షన్ గురించి చెప్పాల్సిన పనేలేదు..ఈ సినిమా లో కూడా బన్నీ నుండి ఎంత రాబట్టలో అంత రాబట్టాడు త్రివిక్రమ్. ఎమోషన్ తో కూడా బన్నీ కట్టిపడేసాడు. ఇక సాంగ్స్ లో బన్నీ మరోసారి తన డాన్సులతో డాన్స్ ప్రియులను కట్టిపడేసాడు. ఇక యాక్షన్ ఓ రేంజ్ లో చూపించాడు.

* పూజా హగ్దే గ్లామర్ తో పాటు తన నటనతోను ఆకట్టుకుంది.

* సీనియర్ నటి టబు చాల రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది.

* ఆనంద్ గా జయరాం తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

* తమిళ్ నటుడు సముద్రఖని విలన్ రోల్ లో చించేసాడు. ఈ సినిమా తో ఆయనకు తెలుగులో మరిన్ని అవకాశాలు పెరగడం ఖాయం.

* రాజ్ పాత్ర లో సుశాంత్ బాగానే నటించాడు. సుశాంత్ – నివేత మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ కు బాగా నచ్చుతాయి.

* వాల్మీకి పాత్రలో అల్లు అర్జున్ తండ్రిగా మురళి శర్మ అదరగొట్టాడు. ఈయన పాత్ర గురించి ఎంత చెప్పిన తక్కువే..మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

* రాహుల్ రామకృష్ణ , వెన్నెల కిషోర్ , చమ్మక్ చంద్ర కామెడీ ఆకట్టుకుంది.

* నవదీప్ , సునీల్ , బ్రహ్మాజీ , అజయ్ , తనికెళ్ళ భరణి , బ్రహ్మానందం , హర్ష వర్ధన్, రోహిణి మొదలగు వారంతా వారి వారి పరిధిలో నటించి మెప్పించారు.

సాంకేతిక విభాగం :

* మ్యూజిక్ థమన్ సినిమాకు ప్రాణం పోసాడని చెప్పాలి..సినిమాకు సంక్రాంతి బరిలో ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఈయన మ్యూజిక్ అనే చెప్పాలి. కేవలం పాటలు మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు.

త్రివిక్రమ్ ఏం కావాలనుకున్నాడో..థమన్ నుండి శ్రోతలను ఏం కోరుకున్నారో అది ఇచ్చి తన సత్తా చాటాడు. ఒకప్పటి థమన్ కు ఇప్పటి థమన్ కు చాల తేడా అని ఎవరినైనా చెప్పాల్సిందే. ఆ రేంజ్ లో తన లోని సత్తాను బయటకు తీసాడు.

* వినోద్ సినిమా ఫొటోగ్రఫీ చెప్పే పనేలేదు. ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంతో కలర్ ఫుల్ గా చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్ తో అందర్నీ అల తెరపై కట్టిపడేసాడు.

* నవీన్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో స్పీడ్ గా సాగింది..ఎక్కడ బోర్ లేకుండా ఫాస్ట్ గా పూర్తి చేసాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఓ పది నిముషాలు స్లో గా అనిపిస్తుంది. అక్కడ కాస్త చూసుకునే బాగుండేది.

* ఇక గీత ఆర్ట్స్ – హారిక నిర్మాణ విలువలు చెప్పాల్సిన పనిలేదు. సినిమా అంటే ఇష్టపడే వీరిద్దరూ ఆ సినిమా బాగా రావడం కోసం ఇంత ఖర్చైనా పెట్టేందుకు వెనకడుగు వెయ్యరు. ఈ సినిమాలోనూ అదే చేసారు. వీరు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది.

* ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి చెప్పాలంటే..గత రెండు సినిమాలు త్రివిక్రమ్ సత్తాను పూర్తిగా చూపించలేకపోయినప్పటికీ..ఈ వైకుంఠపురం లో మాత్రం త్రివిక్రమ్ మార్క్ కనపడింది. కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ఇలా ప్రతిదీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రతి ఒక్క నటుడిని చాల బాగా వాడుకున్నాడు. కాకపోతే సెకండ్‌ హాఫ్‌ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. వావ్‌ అనిపించే సన్నివేశాలు పెద్దగా లేకపోవటం, ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవటం అభిమానులను నిరాశ కలిగిస్తుంది. అలాగే ఓ పదినిమిషాలు స్లో గా ఉండడం కూడా ఇబ్బంది పెట్టింది. మిగతా అంత కూడా బాగా నడిపించాడు. ఓవరాల్ గా అభిమానులకు ఈ సినిమా పండగే.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

Click here for English Review