రివ్యూ : అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు – సెటైరికల్ డ్రామా

స్టార్ కాస్ట్ : ఆజ్మల్ అమీర్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు..
దర్శకత్వం : వర్మ
నిర్మాతలు: అజయ్ మైసూర్
మ్యూజిక్ : రవి శంకర్
విడుదల తేది : డిసెంబర్ 12, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు – కల్పిత రాజ్యం (సెటైరికల్ రాజ్యం)

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలను కల్పిత పాత్రలతో తెరకెక్కించి సినిమా కు ఎంత హైప్ తీసుకురావాలో అంత తీసుకొచ్చాడు. అయితే ఈ సినిమా విడుదల అవుతుందో లేదో అని రిలీజ్ రేపు అనే వరకు ఉత్కంఠ గానే సాగింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం ..కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తెరకెక్కించారని కోర్ట్ లో పిటిషన్ వేయడం..ఇలా అనేక వివాదాలు సినిమాను చుట్టుముట్టాయి. అన్ని వివాదాల నుండి బయటపడి ఎట్టకేలకు ఈరోజు (డిసెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి..? అసలు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ఎవరు..? వర్మ ఏం చెప్పాలనుకున్నాడు..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఏపీ లో జరిగిన 2019 ఎన్నికల్లో ఆర్సీపీ చేతిలో వెలుగు దేశం పార్టీ (వీడీపీ) దారుణంగా ఓడిపోద్ది. కేవలం 23 సీట్లతో సరిపెట్టుకొని ప్రతిపక్షంగా మిగిలిపోతుంది. 151 సీట్లతో జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఘోర ఓటమిని తట్టుకోలేని వీడీపీ పార్టీ అధినేత బాబు, ఆయన తనయుడు చినబాబు, పార్టీ నేతలు ఎలాగైనా ఆర్సీపీ పార్టీని దెబ్బకొట్టాలని ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు. కానీ ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి జగన్నాథ రెడ్డి చేసే ప్రజాసేవకు ఫిదా అవుతూ మళ్లీ మళ్లీ నువ్వే రావాలని కోరుకుంటుంటారు.

ప్రజల్లో జగన్నాథ రెడ్డి కి పెరుగుతున్న ఆదరణ చూసి బాబుకు అత్యంత ఆప్తుడు అయిన దయనేని రమా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి ఫై తీవ్ర ఆరోపణలు చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో బెజవాడ బెంజ్ సర్కిల్‌లో ప్రజలంతా చూస్తుండగానే దయనేని రమాను కొంత మంది దారుణంగా హత్య చేస్తారు. మరి దయనేని రమా ను ఎవరు చంపారు..? ఈ హత్య తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి..? ఆర్సీపీ పార్టీ ఫై ప్రజల్లో ఎలాంటి సంకేతాలు చేరతాయి..ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* నటీనటుల యాక్టింగ్

* కామెడీ

* సినిమా ఫొటోగ్రఫీ

మైనస్ :

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒకరు రియల్ పాత్రలకు ఏమాత్రం తీసిపోని రీతిలో నటించి సినిమాకు ప్రాణం పోశారు. జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ అమీర్ , స్పీకర్ తమ్మినేని సీతారాం పాత్రలో అలీ, నారా లోకేష్ పాత్రలో ధీరజ్ , అసలు సిసలైన చంద్రబాబు పాత్రలో ధనంజయ్ ప్రభునే వీరితో పాటు బ్రహ్మనందం, మహేష్ కత్తి , స్వప్న,ధన్ రాజ్ , పృథ్వి రాజ్ , జఫ్ఫార్ ఇలా చాలామంది వారి నటన తో ఆకట్టుకున్నారు.

మనసేన పార్టీ అధినేత ప్రణయ్ కళ్యాణ్ పాత్రను మాత్రం కేవలం సెటైర్ వేయడానికి మాత్రమే పెట్టినట్టు ఉంది. కథలో ఆయన్ని పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు. అప్పుడప్పుడు కనిపిస్తూ రెండు మూడు డైలాగులు చెప్పి వెళ్లిపోయారు. మరి మెగా ఫ్యామిలీ తో రిస్క్ ఎందుకు అనుకున్నారో లేక పవన్ తో గొడవ వద్దులే అనుకున్నారో కానీ ఆయన పాత్ర ను పెద్దగా చూపించే ప్రయత్నామ్ చేయలేదు.

స్పీకర్ తమ్మినేనిగా ఆలీ అదరగొట్టారు. బాగా నవ్వించారు. పీపీ జాల్ పాత్రలో రాము తన విశ్వరూపం చూపించాడు. ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో బాగా కుదిరింది. ఓవరాల్ గా ఆ పాత్రలకు కరెక్ట్ గా సరిపోయే వారిని ఎంపిక చేయడం లో డైరెక్టర్ తో పాటు వర్మ సక్సెస్ అయ్యారు.

సాంకేతిక విభాగం :

* అజయ్ మైసూర్ నిర్మాణ విలువలు బాగున్నాయి..

* రవి శంకర్ నేపధ్య సంగీతం చాల బాగుంది.

* సురేష్ వర్మ సినిమా ఫొటోగ్రఫీ సినిమా హైలైట్ లలో ఒకటిగా నిలిచింది. విజయవాడ సిటీ డ్రోన్ షాట్స్ అయితే అద్భుతం.

* డైలాగ్స్ కూడా చాల బాగా పేలాయి.

* ఇక అసలైన డైరెక్షన్ విషయానికి వస్తే…ఫస్ట్ హాఫ్ ను ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేయచ్చు. మనకు తెలిసిన కథనే చూపించారు. కాకపోతే దానిని కల్పిత పాత్రలతో ఫుల్ ఎంటర్టైన్ గా చూపించి ఆకట్టుకున్నారు. ఇక ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో దయనేని రమా హత్యతో కథ మలుపు తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది..అసలు ఈ హత్య ఎవరు చేసారు అనే ఆసక్తి నింపారు. కానీ సినిమా చివరి వరకు ఈ హత్య ఎవరు చేశారనేది చూపించకుండానే శుభం కార్డు వేశారు.

ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించలేకపోయారు. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు బాగా బోర్ కొట్టిస్తాయి. అయితే, మధ్యలో పీపీ జాల్‌ను రంగంలోకి దించి నవ్వించే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా మాత్రం సినిమాను వివాదాస్పదం గా కాకుండా కామెడీ గా తెరకెక్కించి ఆకట్టుకున్నారు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review