రివ్యూ : అంతరిక్షం

స్టార్ కాస్ట్ : వ‌రుణ్ తేజ్, అదితిరావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి తదితరులు..
దర్శకత్వం : స‌ంక‌ల్ప్ రెడ్డి
నిర్మాతలు: రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
మ్యూజిక్ : ప‌్ర‌శాంత్ ఆర్ విహారి
విడుదల తేది : డిసెంబర్ 21, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : అంతరిక్షం

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ చిత్రం గా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేఎంపీహెచ్’. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా శుక్రవారం (డిసెంబర్ 21) ప్రేక్షకుల ముందుగా భారీ అంచనాల తో విడుదల అయ్యింది.

ఫిదా , తొలిప్రేమ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్..ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ లో నటిస్తుండడం , తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి స్పేస్ నేప‌థ్యం ఉన్న సినిమా కావ‌డం తో యావత్ సినీ ప్రేక్షక లోకం తో పాటు సినీ ఇండస్ట్రీ సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. మరి వారి ఎదురుచూపులు తగ్గట్లు సినిమా ఉందా..? ఘాజి తో సూపర్ హిట్ అందుకున్న సంకల్ప్ ఈ సినిమా తో హిట్ అందుకున్నాడు..లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

మన శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన శాటిలైట్ మిహిర దారి తప్పుతుంది.. దాన్ని వెంటనే స్పేస్ లోకి తీసుకరాకపోతే ప్రపంచంలో ఉన్న కమ్యునికేషన్ వ్యవస్దకు పెద్ద విఘాతం కలుగుతుంది. దీన్ని కక్ష్యలోకి తీసుకొచ్చే వక్తి దేవ్ (వరుణ్ తేజ). కానీ దేవ్ 5 ఏళ్ల క్రితమే కొన్ని కారణాలతో జాబ్ వదిలేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతం దేవ్ ఎక్కడనున్నాడో ఎవరికీ తెలియదు. అతన్ని తీసుకరావడం కోసం వ్యామోగామి రియా (అతిథి రావు హైదరీ) రంగంలో కి దిగుతుంది. అతన్ని పట్టుకుని ఒప్పిస్తుంది.

అక్కడ నుంచి దేవ్ ..స్పేస్ లోకి వెళ్లి మిహరను ఎలా సెట్ చేసాడు..? ఆ ప్రాసెస్ లో అతనికే ఏ సమస్యలు ఎదురయ్యాయి…? అసలు అతను ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవటానికి కారణం ఏమిటి…? లావణ్య త్రిపాఠి కి దేవ్ కు సంబంధం ఏంటి..? అనేవి మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* విజువల్ ఎఫెక్ట్స్

* స్టార్ కాస్ట్

* డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్

మైనస్ :

* స్లో నేరేషన్

* కథనం

* ఫస్ట్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* మొదటి నుండి ప్రయోగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నా వరుణ్ తేజ్..ఈ అంతరిక్షం లో సైంటిస్ట్‌గా, ప్రేమికుడిగా, స్పేస్‌లో సాహసాలు చేసే వ్యోమగామిగా నటించి అదరగొట్టాడు.

* రియా పాత్రలో అదితిరావ్‌ హైదరి బాగానే నటించింది. అందం తో పాటు నటన పరంగానూ మంచి మార్కులు వేసుకుంది.

* లావణ్య త్రిపాఠిది అతిథి పాత్రే అని చెప్పాలి. మిగతా నటి నటులంత వారి వారి పరిధి లో నటించారు.

సాంకేతిక విభాగం :

* జ‌్ఞాన‌శేఖ‌ర్ విఎస్ (బాబా) సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.

* ప‌్ర‌శాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.

* ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సన్నివేశాల్లో ఇంకాస్త తన కత్తెరకు పనిచెపితే బాగుండు అనిపిస్తుంది.

* నిర్మాణ విలువలు సైతం మామూలుగానే ఉన్నాయి.

* ఇక డైరెక్టర్ సంకల్ప్ విషయానికి వస్తే..ఘాజీ సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనం అందించిన సంకల్ప్‌ మరోసారి అదే తరహా ప్రయోగం చేశాడు. తాను రాసుకున్న కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సినిమా స్టాటిన్గ్ లో మిహిరాకు సంబంధించిన డిటెయిల్స్‌ తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్‌ చేసిన సంకల్ప్..కథను బాగా నెమ్మదిగా తీసుకెళ్లడం తో అందరికి బోర్ ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో అంతరిక్షం లోకి వెళ్లడంతో కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు బాగా స్లో గా ఉండడం కాస్త ఇబ్బంది పెట్టింది. లవ్ సీన్స్ ఫై కూడా ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు.

తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి స్పేస్ నేప‌థ్యం ఉన్న సినిమాగా వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. వరుణ్ దేవ్ పాత్రలో అదరగొట్టినప్పటికీ , సినిమా స్లో గా సాగడం , ప్రేమ సన్నివేశాలు సరిగా లేకపోవడం , కథనం కూడా సరిగా లేకపోయేసరికి ప్రేక్షకులు అంతరిక్షాన్ని అంతగా ఆస్వాదించలేకపోయారు.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review