రివ్యూ : గ్యాంగ్ లీడర్ – కామెడీ గ్యాంగ్

స్టార్ కాస్ట్ : నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్‌ తదితరులు..
దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్
మ్యూజిక్ : అనిరుద్
విడుదల తేది : సెప్టెంబర్ 13, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : గ్యాంగ్ లీడర్ – కామెడీ గ్యాంగ్

సరికొత్త స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టిపడేసే విక్రమ్ కె కుమార్ – న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో మొదటిసారి తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. చిరంజీవి నటించిన ఒకప్పటి సూపర్ హిట్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మనం తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయి హిట్ లేని విక్రమ్ ఈ సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

గతఏడాది ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, ఈ ఏడాది ఇప్పటికే ‘జెర్సీ’తో హిట్ కొట్టారు. ఇప్పుడు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ జర్నీ స్టార్ చేసిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో ఎలాంటి హిట్ అందుకున్నాడో పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

ఆరుగురు వ్యక్తులు కలిసి ఓ బ్యాంకు లో 300 కోట్లు చోరీ చేస్తారు. కానీ ఆ వారిలో ఓ వ్యక్తి మాత్రం వీరిద్దర్నీ చంపి ఆ డబ్బంతా తీసుకెళ్తాడు. దీంతో చనిపోయిన వారికీ సంబందించిన వ్యక్తులు మాత్రం ఆ వ్యక్తిని ఎలాగైనా చంపాలని అనుకుంటారు. కానీ వీరంతా ఆడవారు కావడం తో ఓ వ్యక్తి సాయం తో ఆ వ్యక్థని చంపాలని అనుకుంటారు.

ఆ సమయంలో పెన్సిల్ పార్థసారథి(నాని) అనే రివేంజ్‌ కథల రచయిత సాయం తీసుకుంటారు. మరి పెన్సిల్ పార్థసారథి వారికీ ఎందుకు సాయం చేయాల్సి వస్తుంది..? ఆ వ్యక్తి వీరంతా కలిసి చంపారా లేదా..? దేవ్‌ (కార్తికేయ) కు ఈ కథ కు సంబంధం ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* కామెడీ

* నాని యాక్టింగ్

మైనస్ :

* కథ – కథనం

* బోరింగ్ సన్నివేశాలు

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* నాని యాక్టింగ్ కు వంక పెట్టాల్సిన పనిలేదు. కథ కు తగ్గట్లే తనవంతు నాయ్యం చేసాడు. కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌ ఇలా అన్ని కలబోసి ఆకట్టుకున్నాడు.

* ఈ చిత్రం ద్వారా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఆమె పాత్ర పెద్దగా లేకపోవడం ఆమె గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.

* RX 100 ఫేమ్ కార్తికేయ విలన్ రోల్ లో ఈ సినిమాలో నటించాడు. లుక్స్‌, యాటిట్యూడ్‌తో మంచి విలనిజం చూపించాడు.

* వెన్నెల కిశోర్‌ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

* లక్ష్మీ, శరణ్య, ప్రియదర్శి, అనీష్‌ కురివిల్లా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది.

* మిరోస్లా బ్రోజెక్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది.

* ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండు. చాల సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి.

* ఇక మైత్రి మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ..కథ – కథనం కాస్త చూసుకుంటే రిజల్ట్ మరో విధంగా ఉండేది.

* ఇక డైరెక్టర్ విక్రమ్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టిపడేసే విక్రమ్..గ్యాంగ్ లీడర్ విషయంలో మాత్రం తన మార్క్ స్క్రీన్ ప్లే చూపించలేకపోయారు. కథ – కథనం తో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కామెడీ తో నడిపించిన ..సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా వదిలేసాడు. అలాగే సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీ ప్రేక్షకులకు అర్ధం కావడం తో ఏముంది సినిమాలో అనే ఫీలింగ్ తో బయటకొస్తున్నారు. కాకపోతే కామెడీ ని ఇష్టపడే ప్రేక్షకులకు కాస్త ఉపశమనం కలుగుతుంది.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review