రివ్యూ : మిస్టర్ మజ్ను- రొటీన్ లవ్ స్టోరీ

స్టార్ కాస్ట్ : అఖిల్ , నిధి అగర్వాల్ తదితరులు..
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాతలు: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
మ్యూజిక్ : తమన్
విడుదల తేది : జనవరి 25, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : మిస్టర్ మజ్ను- రొటీన్ లవ్ స్టోరీ

అఖిల్‌ అక్కినేని, నిధి అగర్వాల్ జంటగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’. అఖిల్, హలో చిత్రాలతో నిరాశ పరిచిన అఖిల్ ..ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి కసితో ఈ సినిమా చేసాడు..ట్రైలర్స్, ప్రోమోస్, స్టిల్స్ ఇలా అన్ని కూడా ఆకట్టుకోవడంతో అక్కినేని అభిమానులు సైతం అఖిల్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వారి ధీమాకు తగ్గట్లు సినిమా ఉందా..లేదా..? అఖిల్ మిస్టర్ మజ్ను గా ఎలా అలరించాడు..? తొలిప్రేమ తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ..మజ్ను తో ఎలాంటి హిట్ కొట్టాడనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

విక్కీ (అఖిల్ ) లవర్ బాయ్ గా ఉంటూ ప్రతి అమ్మాయితో సరదాగా గడుపుతూ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు..తన భర్త శ్రీరాముడిలా ఉండాలని కోరుకునే నిక్కి (నిధి అగర్వాల్ ) విక్కీ తో పరిచయం ఏర్పడుతుంది..ఆ పరిచయం కాస్త ప్రేమగా మారే సమయాన నిక్కీ ప్రేమను విక్కీ రిజక్ట్ చేస్తాడు.

నిక్కీ దూరమైన తర్వాత ఆమెలోని నిజమైన ప్రేమను గుర్తిస్తాడు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..? నిక్కీ ప్రేమను దక్కించుకుంటాడా లేదా..? అసలు నిక్కీ ప్రేమను ఎందుకు దూరం పెట్టాల్సి వస్తుంది…? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* యాక్షన్ ఎపిసోడ్స్

* డాన్స్

* సాంగ్స్

మైనస్ :

* రొటీన్ స్టోరీ

* సెకండ్ హాఫ్

* బాక్గ్రౌండ్ మ్యూజిక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* లవ్ బాయ్ గా అఖిల్ ఆకట్టుకున్నాడు. మునపటి సినిమాల కన్నా ఈ సినిమాలో అఖిల్ యాక్టింగ్, డాన్స్, నటన ఇలా అన్ని అదరగొట్టాడు..కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది.

* నిధి అగర్వాల్ సైతం తన గ్లామర్ పరంగానే కాక నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది.

* నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది మొదలగు నటి నటులంతా వారి వారి పరిధిలో నటించి అలరించారు.

సాంకేతిక విభాగం :

* తమన్ మరోసారి మంచి సాంగ్స్ ఇచ్చి అదరగొట్టాడు..కాకపోతే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎందుకో తగ్గినట్టు అనిపిస్తుంది..తొలిప్రేమ బ్యాక్ గ్రౌండ్ తో పోల్చుకుంటే తగ్గిందనే చెప్పాలి.

* విలియమ్స్ సినిమాటోగ్రఫి హైలైట్ గా నిలిచింది. ప్రతి లొకేషన్ ను ఎంతో అందం గా చూపించి ఆకట్టుకున్నాడు.

* నవీన్ నూలి ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ స్పీడ్ గా సాగిన, సెకండ్ హాఫ్ కాస్త బోర్ కొట్టించాడు..కొన్ని సన్నివేశాలను తగ్గిస్తే బాగుండు.

* బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* తొలిప్రేమ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తన మార్క్ సెన్సిబుల్ డైరెక్షన్‌ని మరోసారి వర్కౌట్ చేసాడు.. అఖిల్‌ లవర్ బాయ్ గా చూపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. నటి నటులందరికి వారికీ తగిన పాత్రలు ఇచ్చి ఆకట్టుకున్న.. ఫస్టాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ కాస్త స్లో చేసాడు.

కొత్తదనం ఉండే లవ్ స్టోరీ కాకుండా, రొటీన్‌ లవ్‌ స్టోరినే ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంత సరదాగా, ఎమోషనల్‌ సీన్స్‌తో నడిపించినా.. సెకండ్‌ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. తొలిప్రేమ క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తే, మిస్టర్ మజ్ను క్లైమాక్స్ మాత్రం తేలిపోయింది. ఓవరాల్ గా అఖిల్ కు రొటీన్ లవ్ స్టోరీనే ఇచ్చాడు.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review