రివ్యూ : ఎన్‌.జి.కె – క్లారిటీ మిస్

స్టార్ కాస్ట్ : సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ తదితరులు..
దర్శకత్వం : శ్రీరాఘవ
నిర్మాతలు: శ్రీసత్యసాయి ఆర్ట్స్‌
మ్యూజిక్ : యువన్‌ శంకర్‌రాజా
విడుదల తేది : మే 31, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘ఎన్‌.జి.కె.(నంద గోపాలకృష్ణ)’. ఈ చిత్రం ఈరోజు ( మే 31న) ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.

మొదటిసారి సూర్య పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నటించడం..రకుల్ , సాయి పల్లవి లు హీరోయిన్లు గా నటించడం తో ఈ సినిమా ఫై అందరిలో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా వారి ఆసక్తి తగినట్లు ఉందా..? గత కొంతకాలం గా హిట్ లేని సూర్య కు ఈ సినిమా హిట్ ఇచ్చిందా..? విభిన్న కథలు అందించే శ్రీరాఘవ ఈ సినిమాతో ఏం చెప్పదల్చుకున్నాడు..అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఎన్‌.జి.కె(సూర్య‌) ఎప్పుడు అందరికి మంచి చేస్తూ..ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ ఆయన మంచితనాన్ని దెబ్బ తీయాలని కొంతమంది ఎన్‌.జి.కె ఫ్యామిలీ ఫై దాడి చేస్తారు. దీంతో ఎన్‌.జి.కె ఆ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ను కలిసి సాయం చేయాల్సిందిగా కోరతాడు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం తమ పార్టీ లో చేరితే సాయం చేస్తానని చెప్పడం తో ఏం చేయాలో తెలియక అందులో చేరతాడు. ఎన్‌.జి.కె మంచితనాన్ని..పేరు ను వాడుకొని మోసాలకు పాల్పడతారు.

దీంతో ఎన్‌.జి.కె సొంతంగా పార్టీ పెట్టాలని..రాజకీయాల్లోకి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. మరి ఎన్‌.జి.కె పొలిటికల్ లో ఎలా రాణిస్తాడు..? ఎలాంటి కష్ఠాలు అనుభవిస్తాడు..? గీత కుమారన్ (సాయి పల్లవి ) ..ఎన్‌.జి.కె కు సంబంధం ఏంటి ..? ఆమె ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది..? వినతి (రకుల్ ) ఎవరు..అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* సూర్య

* సినిమా ఫొటోగ్రఫీ

మైనస్ :

* మ్యూజిక్

* డైరెక్షన్

* హీరోయిన్స్ పాత్రలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

సినిమాకు హైలైట్ గా సూర్య నటించాడు..కథ అంత ఆయన చుట్టూనే తిరగడం తో సూర్య పాత్ర ప్రేక్షకులను , అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎక్క‌డో హీరోయిజం ఎలివేష‌న్‌లేకుండా సినిమాను, క‌థ ప్ర‌కారం పాత్ర‌ను డిజైన్ చేశారు. సూర్య పాత్రలో ఓ ఇన్‌టెన్స్ క‌న‌ప‌డుతుంది. క్లైమాక్స్‌లో సూర్య న‌ట‌న బావుంది.

* సూర్య భార్య గా సాయి పల్లవి నటించింది..పేరుకు భార్య నే అయినప్పటికీ ఆమె పాత్ర పెద్దగా ఏమి లేదు. సూర్య తో పెర్‌ఫ్యూమ్ గురించి గొడ‌వ‌ప‌డుతూ ఉంటుంది..ఆలా ఎందుకు చేస్తుందో సరిగా చూపించలేకపోయారు రాఘవ..

* రకుల్ ఓపెనింగ్ షాట్ చూస్తే కథలో రకుల్ పాత్ర హైలైట్ గా ఉంటుందని అంత అనుకుంటారు..కానీ సినిమా ముందుకు వెళ్తుంటే రకుల్ పాత్ర ఏమి లేదని అర్ధం అవుతుంది.

* విల‌న్‌గా న‌టించిన దేవ‌రాజ్‌, ఇత‌ర పాత్ర‌ధారులు పాత్ర ప‌రిధి మేర న‌టించారు.

సాంకేతిక విభాగం :

* శివకుమార్‌ విజయన్‌ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది

* యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సో సో గానే ఉంది.

* ప్రవీణ్ ఎడిటింగ్ నామాత్రంగానే ఉంది.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక శ్రీరాఘవ విషయానికి వస్తే..మొదటి నుండి కూడా శ్రీరాఘవ కథలు చాల కొత్తగా ఉంటాయి. అందరిలా కాకుండా కాస్త విభిన్న కథల వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అందుకే ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రత్యేక ఆసక్తి కనపరుస్తారు. ఇక ఎన్‌.జి.కె విషయానికి వస్తే మొదటిసారి సూర్య ను పొలిటికల్ బ్యాక్లో డ్రాప్ లో చూపించారు. కాకపోతే ఈయన రాసుకున్న కథే అర్ధం కాకుండా రాసుకున్నాడు. పాత్రల తీరు..గజిబిజి చేస్తాయి. ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ ఇవ్వలేదు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

Click here for English Review