రివ్యూ : నిను వీడని నీడను నేనే – సెన్సిబుల్ అటెంప్ట్

రివ్యూ :  నిను వీడని నీడను నేనే  — సెన్సిబుల్ అటెంప్ట్

స్టార్ కాస్ట్ :  : సందీప్‌ కిషన్‌, అన్యా సింగ్‌, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ
సంగీతం : తమన్
దర్శకత్వం : కార్తీక్ రాజు
నిర్మాత : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల
విడుదల తేది : జులై 12 2019
తెలుగు మిర్చి రేటింగ్3/5

చాన్నాళ్ళ నుండి సరయిన హిట్ లేక అల్లాడుతున్న సందీప్ కిషన్, ఒక సినిమాని నమ్మి ఆ సినిమాకి తానే నిర్మాతగా మారి ఒక సినిమా చేశాడు. అదే నిను వీడని నీడను నేనే సినిమా. హార్రర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా మొదటి షో పూర్తయింది. కెరీర్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తప్ప చెప్పుకోదగ్గ హిట్ లేని ఆయన ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా సందీప్‌కు ఆశించిన విజయం అందించిందా..?  అనేది రివ్యూలో చూద్దాం.

కథ :

2035లో మొదలయ్యే కధలో సైకాలజీ ప్రొఫెసర్‌(మురళీ శర్మ) తను డీల్‌ చేసిన ఓ కేసుకు సంబంధించిన విషయాలను చెప్పటం మొదలుపెట్టగా అది 2013కి మారుతుంది. ఆయన నేరేషన్ ప్రకారం అర్జున్ (సందీప్‌ కిషన్‌), మాధవి (ఆన్య సింగ్) భార్య భర్తలు. ఓ బంగ్లాలో నివాసం ఉంటున్న వీరికి ఓ యాక్సిడెంట్ తరువాత కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతాయి. వారు అద్దంలో చూసుకున్నప్పుడు వారికి బదులుగా రిషి, దియా మరో ఇద్దరి వ్యక్తుల ముఖాలు కనిపిస్తాయి. అలా అద్దంలో ఒకరికి బదులు మరొకరు కనపడడానికి కారణం ఏంటి.?  అద్దంలో కనిపించే రిషి, దియాలు  ఎవరు ? చివరకు రిషీ, దియాలు ఏమయ్యారు? అనేదే కథ.

ప్లస్‌ పాయింట్స్‌:

సందీప్ కిషన్ నటన

ఆర్ ఆర్

అసలు ఊహించలేని కథలోని మలుపులు

మైనస్‌ పాయింట్స్‌:

లాజిక్ లెస్ సీన్లు

సెకండ్ హాఫ్

సెకండ్ హ్యఫ్ లో చొప్పించిన కామెడీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

సందీప్ కిషన్‌ మరోసారి తనదైన నటనతో  ఆకట్టుకున్నాడు. కామెడీతో పాటు హారర్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ ను బాగా పండించాడు. హీరోయిన్ ఆన్య సింగ్ తెలుగులో తొలి సినిమానే అయినా బాగా నటించింది. కీలక పాత్రలో నటించిన వెన్నెల కిశోర్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, ప్రగతి తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :తమన్ ఇచ్చిన మ్యూజిక్‌ తో సినిమా మరో రేంజ్ కి వెళ్ళింది. పాటలు పరవాలేదనిపించినా ఆర్ ఆర్ తో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌పాయింట్‌. ఎడిటింగ్ మీద మరింత సమయం కూర్చోవాల్సి ఉంది. అయితే నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సినిమా మీద పేరుకున్న అంచనాలకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ పాయింట్‌తో సినిమాను స్టార్ట్ చేశాడు కార్తీక్. అయితే ట్విస్ట్ లన్నీ సెకండ్ హాఫ్ లోనే పెట్టిన దర్శకుడు ఫస్ట్‌హాఫ్‌ అంతా కథ నెమ్మదిగా నడిపించాడు. వరుస ట్విస్ట్‌లతో సెకండ్ హ్యాఫ్ అంతా ఆసక్తికరంగా సాగెట్టు చేశాడు. ఇంటర్వెల్‌ సీన్‌, ప్రీ క్రైమాక్స్‌, క్లైమాక్స్‌లుబాగా వచ్చాయి.

మొత్తంగా చూస్తే సందీప్ కిషన్ ప్రయత్నం చాలా వరకూ ఫలించిందనే చెప్పాలి, మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద బేస్ అయి ఉంది సినిమా రిజల్ట్.

తెలుగు మిర్చి రేటింగ్3/5