రివ్యూ : ప్రతిరోజు పండగే – ‘రొటీన్’ ఫ్యామిలీ ఎంటర్టైనర్

స్టార్ కాస్ట్ : సాయి ధరమ్ తేజ్ , రాశి ఖన్నా , సత్యరాజ్ తదితరులు..
దర్శకత్వం : మారుతీ
నిర్మాతలు: జీఏ 2 పిక్చ‌ర్స్‌, యువీ క్రియేష‌న్స్‌
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : డిసెంబర్ 20, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ప్రతిరోజు పండగే ‘రొటీన్’ ఫ్యామిలీ ఎంటర్టైనర్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. చిత్రలహరి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్, మారుతి కలయికలో సినిమా రావడం.. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సినిమాని నిర్మిస్తుండడం.. సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి . ఆ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..టైటిల్ లో ఉన్న పండగ..సినిమా చూసిన వారికీ కలిగిందా..అసలు సినిమా కథ ఏంటి..అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

రఘురామయ్య (సత్యరాజ్ ) తన కొడుకులు , కుమార్తె విదేశాల్లో సెటిలయినప్పటికీ తాను మాత్రం సొంత ఊరిలో ఉంటాడు. ఈ దశలో ఆయనకు లంగ్‌ క్యాన్సర్‌ రావడం తో డాక్టర్స్ ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ లేదని ..ఉన్న నాల్గు రోజులు ఆయన్ను సంతోషంగా ఉండేలా చూసుకోవాలని చెపుతారు. ఈ విషయం తెలిసిన కొడుకులు , కూతురు తన తండ్రి వద్దకు వెంటనే వెళ్లే బదులు..చివరి క్షణాల్లో వెళ్లొచ్చని అనుకున్టరు. కానీ ఈ విష‌యం తెలిసిన పెద్ద మ‌న‌వ‌డు సాయి(సాయితేజ్‌) అమెరికా నుంచి తాత‌య్య ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస్తాడు. తాతయ్య కోరికలను తీర్చే పనిలో ఉంటాడు..చివరి రోజుల్లో తాతయ్య హ్యాపీగా ఉండాలని భావిస్తాడు.

తాత‌య్య కోరిక ప్ర‌కారం ఆయ‌న స్నేహితుడు స‌త్య‌నారాయ‌ణ‌(విజ‌య్‌కుమార్‌) మ‌న‌వ‌రాలు ఎంజెల్ అర్నా(రాశీఖ‌న్నా)ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. వారి కుటుంబ స‌భ్యుల‌ను కూడా ఒప్పిస్తాడు. అదే స‌మ‌యంలో సాయి తండ్రి (రావు ర‌మేష్‌).. బిజినెస్ కోసం ఓ పెళ్లి సంబంధం చూస్తాడు. కానీ తీరా కొడుకు మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడ‌ని తెలిసి ఇండియా వ‌చ్చేస్తాడు. అత‌నితో పాటు ఇత‌ర త‌మ్ముళ్లు, చెల్లెలు కూడా వ‌చ్చేస్తారు. కానీ ఆలా వచ్చిన వారికి ఓ నిజం తెలిసి షాక్ అవుతారు. ఇంతకీ ఆ నిజం ఏంటి..? రఘురామయ్య చనిపోతాడు లేదా..? అసలు ఏం జరుగుతుందనేది అసలు స్టోరీ.

ప్లస్ :

* సత్యరాజ్

* సత్య రాజ్ – సాయి తేజ్ మధ్య సన్నివేశాలు

* కామెడీ

* మ్యూజిక్

* క్లైమాక్స్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* రొటీన్ స్టోరీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర లో అందర్నీ కట్టిపడేసిన సత్య రాజ్..ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ మూవీ లో రఘురామయ్య పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఈయన చుట్టూనే సినిమా అంతా ర‌న్ అవుతుంది. ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా క్యారీ చేశాడు. తన చావును కోరుకునే తన కుటుంబసభ్యుల అనుచిత ప్రవర్తన, ఎప్పుడెప్పుడా వెళ్లిపోదామా అనుకునే వారి తీరుతో ఆయన పడే మానసిక క్షోభ.. సత్యరాజ్‌ అద్భుతంగా పండిచారు.

* సాయి తేజ్ ఈ సినిమాతో తనలోని మరో నటుడిని బయటకు తీసాడు. తాత కోర్కెలను తీర్చే మనవడిగా చాల చక్కగా నటించాడు. అలాగే ఒక ఫైట్‌ సీన్‌లో సిక్‌ప్యాక్‌ బాడీ తో కనిపించి మెగా అబిమానులను ఆకట్టుకున్నాడు.

* ఇక ఎంజెల్ అర్ణ పాత్ర‌లో రాశీఖ‌న్నా పాత్ర ఆట్టుకుంటుంది. ఆమె పాత్ర చాలా కామెడీగా సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో ఈ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం క‌న‌ప‌డ‌దు.

* సాయి తండ్రిగా రావు రమేశ్‌ పాత్ర సెటిల్డ్‌ యాక్టింగ్‌తో ఆద్యంతం నవ్వులు కురిపిస్తుంది.

* హ‌రితేజ‌, ప్ర‌వీణ్‌, అజ‌య్‌, స‌త్యం రాజేష్‌, విజ‌య్ కుమార్‌, భ‌ర‌త్ రెడ్డి, ప్ర‌భ ఇలా అంద‌రూ వారి వారి ప‌రిధుల మేర చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతిక విభాగం :

* ఈ చిత్రానికి థమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది..పాటలు , నేపధ్య సంగీతం ఇలా అన్ని కథకు తగ్గట్లు కుదిరాయి.

* సినిమా స్థాయి తగ్గట్టుగా నిర్మాణ విలువలు రీచ్‌గా ఉన్నాయి.

* సెకండ్ హాఫ్ లో ఇంకాస్త ఎడిటింగ్ కు పని చెపితే బాగుండు.

* జ‌య‌కుమార్ కెమెరా ప‌నిత‌నం బావుంది.

* ఇక డైరెక్టర్ మారుతీ రాసుకున్న కథలో కొత్తదనం లేనప్పటికీ సెంటిమెంట్ సన్నివేశాలు , కామెడీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కామెడీ గా బాగానే నడిపించిన సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ గా నడిపించాడు. ఒకానొక సమయం లో శతమానం భవతి చిత్రాన్ని గుర్తు చేసాడు.

తాతకు లంగ్‌క్యాన్సర్‌ అని తెలియడం తో మానవడు సాయి అమెరికా నుండి రావడం.. తాత కోరికలు తీర్చడం, తాత కోసం ఏంజిల్‌ అరుణను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటం, సత్యరాజ్‌ పిల్లలంతా ఇంటికి చేరడం ఇలా అంత అర్థమయ్యేలా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం బాగా రాసుకొని సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా ప్రతిరోజు ‘రొటీన్’ పండగే..

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review