రివ్యూ : రాజు గారి గది 3 – కామెడీ గది

స్టార్ కాస్ట్ : అశ్విన్‌ బాబు, అవికా గోర్‌, అలీ తదితరులు..
దర్శకత్వం : ఓంకార్
నిర్మాతలు: ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌
మ్యూజిక్ : ష‌బీర్‌
విడుదల తేది : అక్టోబర్ 18, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : రాజు గారి గది 3 – కామెడీ గది

యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్..రాజు గారి గది చిత్రంతో డైరెక్టర్ గా సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. హర్రర్ కు కామెడీ మిక్స్ చేసి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత దీనికి సీక్వెల్ తీసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా దీనికి మూడో పార్ట్ గా రాజు గారి గది 3 తో ఈ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మొదట రెండు చిత్రాలలో పూర్ణ, సమంత నటించగా ఈ మూడవ చిత్రంలో అవికా గౌర్ నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? రాజు గారి గది 3 లో ఏముంది..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

మాయ (అవికా గౌర్) డాక్టర్ వృత్తి చేస్తుంటుంది..మాయ తండ్రి కేరళలో పేరుమోసిన మాంత్రికుడు..ఈ నేపథ్యంలో మాయ ను ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే వారికీ శిక్ష పడేలా ఓ ఆత్మను ఇమెలోకి పంపిస్తాడు. దీంతో మాయ ను ఎవరైనా ఏడిపించిన..ప్రేమ పేరుతో వెంటపడిన వారిని ఆత్మ చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో ఓ కాల‌నీలో అనాథ‌గా పెరిగిన అశ్విన్‌(అశ్విన్‌బాబు), అలీతో క‌లిసి జీవిస్తుంటాడు. మందు తాగుతూ, కాల‌నీలో గొడ‌వ‌లు చేస్తూ ఉంటారిద్ద‌రూ. ఆ కాల‌నీలో ఉండే వారు ఎలాగైనా అశ్విన్‌ ను ఇక్కడి నుండి పంపాలని..మాయ ప్రేమలో పడేలా ప్లాన్ చేస్తారు.

ఆలా మాయ ప్రేమలో అశ్విన్ పడతాడు..మరి అశ్విన్..మాయ కు తన ప్రేమ విషయాన్నీ చెపుతాడా..? ఆలా చెపితే ఆత్మ ఊరుకుంటుందా..? అసలు మాయ నుండి ఆత్మ బయటకు వెళ్తుందా లేదా..? అశ్విన్ ప్రేమ ఏమవుతుంది..? ఇవ్వన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* కామెడీ

* స్క్రీన్ ప్లే

* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* హర్రర్ అంశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

రాజు గాది గది సినిమాతో హీరోగా పరిచయమైన ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు.. ఆ తర్వాత రాజుగారి గది 2తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలో మాత్రం అశ్విన్ ను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసాడు ఓంకార్. అశ్విన్త సైతం తన పరిధిలో బాగానే నటించాడు.

* చేశాడు. ఇక అవికా గోర్ పాత్ర ఓకే అనిపించింది. సినిమాలో అజ‌య్‌ఘోష్‌, ఐశ్వ‌ర్య, అలీ పాత్ర‌ల‌తోనే సినిమా ఆ మాత్ర‌మైనా కామెడీగా అనిపించింది. ఈ మూడు పాత్ర‌ల్లో కామెడీ ఉండేలా ద‌ర్శ‌కుడు సినిమాను బాగానే ద‌ట్టించాడు.

* మిగతా నటి నటులు వారి వారి పరిధి మేరకు ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగం :

* ష‌బీర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ కథ కు ప్రాణం పోసింది.

* చోట కెమెరా వర్క్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మరోసారి తన సత్తా చూపించాడు.

* బుర్ర సాయిమాధవ్‌ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి

* నిర్మాణ విలువలు బాగున్నాయి

* ఇక డైరెక్టర్ ఓంకార్ విషయానికి వస్తే…తొలి పార్ట్‌లో కామెడీతో గట్టెక్కిన ఓంకార్.. రెండో భాగంలో అంతగా కామెడీని పండించలేకపోయాడు. అందుకే ఇపుడు మూడో భాగానికి ఎక్కువగా హార్రర్ కామెడీనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకు కేరళను బ్యాక్ గ్రౌండ్‌గా ఎంచుకోవడం.. అక్కడ మంత్ర తంత్రాలు క్షుద్రశక్తులను ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు.

అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్‌ ఆడటమనే కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్‌ చేసాడు. కానీ అంతగా భయపెట్టి థ్రిల్‌ చేసే అంశాలు ఫై దృష్టి పెట్టలేకపోయాడు. దర్శకుడిగా ఓంకార్‌ టేకింగ్‌ బాగుంది. సెకండాఫ్‌లో ప్రీక్లైమాక్స్‌లో వ‌చ్చే 20 నిమిషాల‌ హార‌ర్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్ష‌కుల‌ను బాగా న‌వ్విస్తాయి.

ముఖ్యంగా అజ‌య్‌ఘోష్‌, ఐశ్వ‌ర్య, అలీ పాత్ర‌లు సెకండాఫ్‌లో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డంలో స‌క్సెస్ అయ్యాయి. డైరెక్ట‌ర్ ఓంకార్ ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు. అయితే ఫ‌స్టాఫ్ గొప్ప‌గా లేకపోవడం తో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను ఫుల్ గా ఎంజాయ్ చేసేలా తెరకెక్కించారు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review